తిరుగులేని ‘బాద్‌షా’( ప్రివ్యూ)
హైదరాబాద్ : నందమూరి అభిమానలకు ఈ రోజు పండుగ. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో చిత్రం రెడీ అయ్యి విడుదల అవుతోంది. 'బాద్‌షా' చిత్రం ఈ రోజు( ఏప్రియల్ 5న) ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు అవుతోంది. బెనిఫిట్ షోలు ఉదయమే ప్రారంభమయిపోయాయి. అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ టాక్ రన్ అవుతోంది. బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం యు/ఏ సర్ట్ఫికెట్ పొందింది.
జానకి(కాజల్) విదేశాల్లో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తూంటుంది. తనని తొలి చూపులోనే ఇష్టపడతాడు ఎన్టీఆర్ రామారావు(ఎన్టీఆర్). అతను చాల సరదా కుర్రాడు. పదిమందిని సంతోషపెట్టడానికి ఏమైనా చేస్తాడు. రివైంజ్ నాగేశ్వరరావు(ఎమ్మెస్ నారాయణ) ఓ స్టార్ డైరక్టర్. అక్కడ ఓ సినిమా తీయాలనుకుంటాడు. ఆ నాగేశ్వరరావచుతో ఈ రామారావు ఓ ఆటాడుకుంటాడు. ఈ క్రమంలో జానికి ...రామారావుని ఇష్టపడుతుంది. అయితే...రామారావు వెనక బలమైన కథ ఉంది. జానికిని ప్రేమలో దింపటానికి ఓ కారణం ఉంది. అదేమిటి అన్నది సస్పెన్స్. పద్మనాభ సింహా(బ్రహ్మానందం), ఆది(నవదీప్) పాత్రలూ కథలో కీలకమే.
'బాద్‌షా డిసైడయితే వార్ వన్‌సైడయిపోద్ది..పత్యర్థుల వ్యూహాల్ని ముందే పసిగట్టి ఎత్తుకు పై ఎత్తు వేయడం బాద్‌షా స్టైల్. ఇంతకీ బాద్‌షా కథేంటీ? అతని గెటప్‌ల వెనకున్న ఆసక్తికరమైన రహస్యమేంటో తెలుసుకోవాలంటే 'బాద్‌షా' చూడాల్సిందే' అంటున్నారు శ్రీనువైట్ల.
నటీనటులు: ఎన్టీఆర్, కాజల్, నవదీప్, సిద్దార్ద్, బ్రహ్మానందం, ఎమ్ ఎస్ నారాయణ తదితరులు.
సంగీతం: థమన్ ఎస్.ఎస్,
మాటలు: కోనా వెంకట్, గోపీమోహన్,
కెమెరా: ఎ.ఎస్.ప్రకాష్,
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ,
నిర్మాత: బండ్ల గణేష్,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనువైట్ల.


Click it and Unblock the Notifications











