‘బాద్‌షా’కు.... జూ ఎన్టీఆర్ కెరీర్లోనే రికార్డ్ రేటు!
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రం పలు రికార్డులను నెలకొల్పుతూ ముందుకు సాగుతోంది. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ విషయంలో అందరినీ ఆశ్చర్య పరిచింది. 'బాద్ షా' ఓవర్సీస్(విదేశీ) రైట్స్ రూ. 4.5 కోట్లకు అమ్మడు పోయాయి. గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు ఈ భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులు సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ ఎంటైర్ కెరీర్లోనే ఓవర్సీస్ రైట్స్ ఈ రేంజిలో రావడం ఇదే తొలి సారి.
ఢీ, రెడీ, దూకుడు లాంటి హిట్ చిత్రాల నేపథ్యంలో శ్రీను వైట్ల సినిమాలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరి కాంబినేషన్ వల్లనే ఈ రేంజిలో రేటు రావడానికి కారణమైందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని, ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
'బాద్ షా' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











