twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాద్‌షా' టీజర్ లో ఎన్టీఆర్‌ చెప్పే డైలాగు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రం టీజర్ ని ఈ నెల 24న 'బాద్‌షా' విడుదల చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో ఈ చిత్రం టీజర్ లో రాబోయే డైలాగు అంటూ ఒకటి ప్రచారంలో కి వచ్చింది. అదేమిటంటే..

    " 'బాద్‌షా' డిసైడ్ అయితే ....వార్ వన్ సైడ్ అవ్వుద్ది "

    ఇక ఈ డైలాగు ఈ చిత్రంలో ఉందో లేదో కానీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో బాగా పాపులర్ అవుతోంది. అయితే టీజర్ లో వదిలే డైలాగు మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని మాత్రం అభిమానులు ఎదురుచూస్తున్నారు. హీరోల ఇమేజ్‌కి తగ్గ రీతిలో కథలను ఎంచుకోవడం, వారిలోని మాస్ యాంగిల్‌ని అద్భుతంగా వినియోగించుకోవడం, తనదైన శైలిలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం... ఇదీ దర్శకుడు శ్రీనువైట్ల స్టైల్. అందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ. శ్రీనువైట్ల గత చిత్రం 'దూకుడు' బాక్సాఫీస్ దగ్గర చేసిన హల్‌చల్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో 'బాద్‌షా' లో ఈ మ్యాజిక్ జరుగుతుందంటున్నారు. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ . బండ్ల గణేష్ నిర్మాత.

    ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ- ''తెలుగు చిత్రపరిశ్రమలోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఎన్టీఆర్, కాజల్‌లతో పాటు తెలుగు, తమిళ, హిందీ రంగాలకు చెందిన 50మందికి పైగా ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. బ్యాంకాక్‌లో, హైదరాబాద్‌, గుజరాత్, యూరప్, హాంకాంగ్‌లలో నిరవధికంగా షూటింగ్ జరిపి జనవరి 11న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేస్తాం. ఆసక్తిగొలిపే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో షూటింగ్ సాగుతోంది. హీరోయిన్ తోపాటు ఎమ్మెస్‌ నారాయణ, వెన్నెల కిషోర్‌ తదితరులపై వినోద ప్రధానమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో కీలకమై నిలుస్తాయని చెప్తున్నారు.

    ఇందులోని యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్‌టైన్ చేస్తాయి. 'బాద్‌షా'గా ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు'' అని తెలిపారు. ''ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే నా స్టైల్‌లో పూర్తి వినోదభరితంగా సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ, ఆయన లుక్ కొత్తగా ఉంటుంది. నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా అవుతుంది'' అని శ్రీనువైట్ల చెప్పారు. తమన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు తెరవెనుక ప్రముఖంగా పనిచేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల.

    English summary
    NTR’s new movie ‘Baadshah’ first teaser will be releasing on 24th September in connection with the birthday of the film’s director Srinu Vytla. As per the sources, a dialogue from this teaser is certainly going to rock and it is as follows.
 
 “BAADSHAH DECIDE AYITHE..WAR ONE SIDE AVUDDI.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X