రామ్ చరణ్ రికార్డ్ బద్దలు కొట్టిన జూ ఎన్టీఆర్!
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన సినిమాలతో పలు రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. నాయక్ సినిమా విడుదలకు ముందు సీడెడ్ ఏరియా రైట్స్ రూ. 7.5 కోట్లు రావడం, అదే విధంగా నెల్లూరు ఏరియాకి గాను 'ఎవడు' మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ. 1.95 కోట్లు రావడం అప్పట్లో ఆల్ టైం రికార్డుగా నమోదైంది.
తాజాగా ఈ రికార్డులను జూ ఎన్టీఆర్ 'బాద్ షా' మూవీ బద్దలు కొట్టినట్లు ట్రేడ్ టాక్. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం 'బాద్ షా' మూవీ సీడెడ్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏకంగా రూ. 8.10 కోట్లుకు శోభన్ అనే డిస్ట్రిబూటర్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అదే విధంగా నెల్లూరు ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ. 2 కోట్లు అమ్ముడయ్యాయని టాక్.
బాద్ షా సినిమా వివరాల్లోకి వెళితే...
శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈచిత్రంలో హీరోయిన్. ఈ చిత్రం ఆడియో ఈ మార్చి 10 న విడుదల కానుంది. అలాగే చిత్రం ఏప్రియల్ 5 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 16 నుంచి ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ జరగనుంది.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











