ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సంక్రాంతి కానుక (అఫీషియల్ నోట్)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'బాద్ షా' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'ప్రస్తుతం ఇటలీలోని మిలాన్‌లో ఎన్టీఆర్ పై పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు సాగుతుంది. ఆగస్టు మొదటి వారంలో బ్యాంకాక్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. నాన్ స్టాప్‌గా డిసెంబర వరకు జరిగే షూటింగుతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. జనవరి 11, 2013న సంక్రాంతి కానుకగా చాలా గ్రాండ్ లెవల్లో 'బాద్ షా' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అన్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











