For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేక పెట్టిస్తున్న ‘బాద్‌షా’ ఆడియో పోస్టర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్, కాజల్ జంటగా బండ్ల గణేష్ నిర్మిస్తున్న 'బాద్‌షా' చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 17న జరగనుంది. ఈ సందర్భంగా ఆడియో రిలీజ్ పోస్టర్ ని వదిలారు. ఆ పోస్టర్ ఇప్పుడు ఓ రేంజిలో అభిమానులను అలరిస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రానికి సంబంధించిన ఆడియో కార్యక్రమం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ రామానాయుడు సినీ విలేజ్‌లో జరగనుంది.

    నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్, శ్రీనువైట్ల కలయికలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం గ్రాండ్‌గా జరపనున్నామని, థమన్ అద్భుతమైన బాణీలను అందించారని తెలిపారు. యుఎస్‌లో చిత్రానికి మాస్టరింగ్ జరుగుతోందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

    ఎన్టీఆర్ లుక్స్, స్టయిల్, డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయని, ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే రేంజ్‌లో చిత్రం రూపొందిందని, యాక్షన్ సెంటిమెంట్ ఎంటర్‌టైనర్‌గా చిత్రీకరించిన బాద్‌షా వేసవి కానుకగా ప్రేక్షకులకు అందనుందని తెలిపారు. ఈ చిత్రం ఏప్రియల్ 5 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే రోజు ఉదయం 5.23 నిముషాలకు విడుదల ముహూర్తం ఫిక్స్ చేసారని తెలుస్తోంది. ఇందుకోసం నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యేకంగా పండితులను కలిసి ముహూర్తం పెట్టించారని తెలుస్తోంది.

    ఎన్టీఆర్ హెయిర్‌స్టయిల్ నుంచి పెట్టుకున్న వాచ్, మాట్లాడే ప్రతి మాటా.. ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. బ్రాండెడ్ వేర్‌లో 'లిమిటెడ్ ఎడిషన్' అంటారే... అలా ఈ 'బాద్‌షా' ఓ 'స్పెషల్ పీస్'లాంటిది. ఆరంభం నుంచి శుభం వరకు శ్రీను వైట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని చేశారు. మేమందరం గర్వంగా చెప్పుకునే చిత్రం అవుతుంది అంటున్నారు నిర్మాత బండ్ల గణేష్. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Here is the pic of NTR's most awaited entertainer Baadshah's audio poster. producer Bandla Ganesh even fixed a muhurtham for NTR's Baadshah release. Brahmin pundits reportedly suggested him to release 'formally' on the auspicious muhurtham of 5.23 am early morning hour on April 5th. Srinu Vytla has taken the Telugu Cinema to next level when it comes to grandeur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X