పాత బస్తీలోకి ఎంటరైన జూ ఎన్టీఆర్....ఓ వైపు ఉద్రిక్తత!
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్ షా' చిత్రం కొద్ది రోజులుగా హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు పాత బస్తీలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జూ ఎన్టీఆర్ 'బాద్ షా' షూటింగ్ పాత బస్తీ ప్రాంతంలో ప్లాన్ చేయడం చర్చనీయాంశం అయింది.
శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈచిత్రంలో హీరోయిన్. ఈ చిత్రం ఆడియో ఈ మార్చి 10 న విడుదల కానుంది. అలాగే చిత్రం ఏప్రియల్ 5 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 16 నుంచి ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ జరగనుంది.
దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని, ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











