జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’ ఇటలీ టు స్విస్
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షెడ్యూల్ నిన్నటితో పూర్తయింది. ఇక్కడ ఇంత కాలం పలు కీలక సన్నివేశాలతో పాటు హీరో హీరోయిన్లు జూ ఎన్టీఆర్, కాజల్‌లపై పాటలు చిత్రీకరించారు. ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ జరుపుకోవడానికి స్విట్జర్లాండ్ వెలుతోంది. వచ్చే వారం నుంచి అక్కడ షూటింగ్ మొదలు కానుంది.
శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'బాద్ షా' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. డిసెంబర్ కల్లా షూటింగ్ పార్టు పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. అదే నెలలో ఆడియో విడుదల కానుంది.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











