కోర్టులో లొంగిపోయిన నిర్మాత గణేష్ బాబు
నిర్మాత బండ్ల గణేష్కు రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5వేలు నగదు, ఇద్దరు పూచీకత్తుతో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. 'బాద్‌షా' సినిమా ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఓ అభిమాని మృతి చెందటంతో బండ్ల గణేష్పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో ఆయన మంగళవారం కోర్టులో లొంగిపోయారు. అనంతరం కాసేపటికి బండ్ల గణేష్‌కు బెయిల్ లభించింది. రూ.5వేల పూచీకత్తు, ఇద్దరి జమానత్‌తో అతనికి బెయిల్ లభించింది.
వివరాల్లోకి వెళితే.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్‌షా ఆడియో వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. వరంగల్‌కు చెందిన ఒక అభిమాని తొక్కిసలాటలో చనిపోయాడు. నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ ఆడియో వేడుక కార్యక్రమంలో పెద్దసంఖ్యలో వచ్చిన అభిమానులకు తగ్గట్లుగా ఏర్పాట్లు జరగకపోవడంతో ఈ విషాదం జరిగినట్లు సమాచారం. చనిపోయిన అభిమాని కుటుంబాన్ని ఆదుకుంటానని ఎన్టీఆర్ గద్గద స్వరంతో చెప్పారు. ఆ కుటుంబానికి రు.5 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తానని నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించారు.
సినిమాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాల్లో నిర్వాహకులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. దీంతో అభిమానులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపిస్తూ హైకోర్టు న్యాయవాది సోమరాజు లోకాయుక్తను ఆశ్రయించారు. 'బాద్‌షా' సినిమా ఆడియో ఆవిష్కరణ సందర్భంగా రాజు అనే యువకుడు మృతి చెందినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వేడుకల్లో తరచుగా విషాదకర సంఘటనలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు.


Click it and Unblock the Notifications












