ట్రైలర్ టాక్ : సినిమానా యుద్ధమా ఇది..పోస్టర్ లో పిచ్చెక్కించేలా హాట్ జంట..తీవ్ర విమర్శలు!

Recommended Video

ట్రైలర్ టాక్ : సినిమానా యుద్ధమా ఇది..పోస్టర్ లో పిచ్చెక్కించేలా హాట్ జంట

బాలీవుడ్ హీరో, టైగర్ ష్రాఫ్, అందాల మెరుపు తీగ దిశా పటాని జంటగా నటించిన చిత్రం బాగి 2. తెలుగులో సంచలన విజయం సాధించిన క్షణం చిత్ర కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా బాగి 2 చిత్ర ట్రైలర్ విడుదలైంది. క్షణంలో మూలా కథని మాత్రమే తీసుకుని మిగిలిన భాగాన్ని పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. కండలు తిరిగిన వీరుడు టైగర్ ష్రాఫ్ చేస్తున్న పోరాటాలు అబ్బురపరిచే విధంగా ఉన్నాయి.

క్షణం ఆధారంగా

క్షణం ఆధారంగా

ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. క్షణం చిత్రం పూర్తిగా కథపైనే సాగుతుంది. ఇంటెలిజెంట్ అనిపించే సన్నివేశాలు ఉంటాయి. కానీ బాగి 2 చిత్రాన్ని పూర్తి గా యాక్షన్ భరితం చేసేసారు.

మూల కథని మాత్రమే

మూల కథని మాత్రమే

క్షణం చిత్రంలోని మూలకథని మాత్రమే తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. టైగర్ ష్రాఫ్ కు అనుగుణంగా, బాగి చిత్రంలాగా బాగి 2 ని పూర్తిగా యాక్షన్ చిత్రంగా మార్చేశారు దర్శకుడు అహ్మద్ ఖాన్.

కండలు తిరిగిన వీరుడు

కండలు తిరిగిన వీరుడు

టైగర్ ష్రాఫ్ ఈ చిత్రంలో హాలీవుడ్ హీరోని తలపిస్తునాడు. పోరాట సన్నివేశాలో టైగర్ ష్రాఫ్ కండలు తిరిగిన వీరుడిలా కనిపిస్తున్నాడు. ట్రైలర్ లో టైగర్ ష్రాఫ్ హీరోయిజాన్ని అద్భుతంగా ఎలివేట్ చేసారు.

అబ్బుర పరిచేలా

ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ అబ్బురపరిచేలా ఉండబోతున్నాయనే విషయం ఈ ట్రైలర్ ద్వారా స్పష్టం అవుతోంది. పోరాటం కోసం వెర్రెత్తిపోయిన వీరుడిలా టైగర్ ష్రాఫ్ చెలరేగిపోతున్నాడు.

హెలికాఫ్టర్ పైకి దూకి

హెలికాఫ్టర్ పైకి దూకి

ఓ కొండమీది నుంచి హెలికాఫ్టర్ పైకి దూకి దానిని టైగర్ ష్రాఫ్ కూల్చివేస్తాడు. టైలర్ లో చూపిన ఈ షూట్ చూసి అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రంలో ఎలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయో.

పోస్టర్ లో హాట్ హాట్ గా

పోస్టర్ లో హాట్ హాట్ గా


ట్రైలర్ విడుదలైనట్లు తెలియజేసే పోస్టర్ ని బాగి 2 చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో టైగర్ ష్రాఫ్, దిశా పటాని పిచ్చెక్కించే హాట్ లుక్ లో అదిరిపోతున్నారు.

రియల్ లైఫ్ ప్రేమ జంట

రియల్ లైఫ్ ప్రేమ జంట

టైగర్ ష్రాఫ్, దిశా పటాని మధ్య ఘాడమైన ప్రేమ వ్యవహారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి వెనుకాడడం లేదు. వీరిద్దరూ కలసి సహజీవనం చేస్తున్నారనే వార్తలు కూడా ఉన్నాయి.

కాపీనా.. రీమేకా

కాపీనా.. రీమేకా

బాగి 2 చిత్రం తెలుగు చిత్రం క్షణం ఆధారంగా రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అడవి శేష్, అనసూయ, ఆదా శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందిన క్షణం చిత్రం సంచలన విజయం సాధించింది. కానీ బాగి చిత్ర యూనిట్ క్షణం చిత్రానికి క్రెడిట్ ఇవ్వడం లేదు.

తీవ్రమైన విమర్శలు

తీవ్రమైన విమర్శలు

బాగి 2 చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారా లేక కాపీ చేస్తున్నారా అనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. అంతే కాకుండా విపరీతమైన యాక్షన్ సన్నివేశాలతో అసలు కథని నాశనం చేసినట్లు కనిపిస్తోందని కూడా పెదవి విరుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X