»   » బాక్సాఫీస్ బద్దలైంది: బాహుబలి ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్టు

బాక్సాఫీస్ బద్దలైంది: బాహుబలి ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారతీయ సినీ చరిత్రలో ‘బాహుబలి' ప్రత్యేకం. ఇలాంటి పెద్ద సినిమా ఇదివరకెన్నడూ రాలేదు. భారీ బడ్జెట్, భారీ సెట్టింగులు, భారీ తారాగణం, భారీగా గ్రాఫిక్స్ ఇలా అన్ని విషయాల్లోనూ భారీ తనం ప్రదర్శించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నేడు ప్రేక్షకులముందుకొచ్చింది.

అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన ఈ సినిమా గత తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొడుతుందనే విషయం ఇప్పటికే ఖరారైంది. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ఈ చిత్రం చరిత్ర సృష్టిస్తుందని అంచనా వేసారు. సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుండే అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఆన్ లైన్లో పెట్టిన టికెట్లు పెట్టినవి పెట్టినట్లుగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.


Baahubali 1st day collection report

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోనే బాహుబలికి తొలిరోజు 16 కోట్లకుపైగా షేర్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్ర తెలుగువెర్షన్‌కు తొలిరోజు 22కోట్లకుపైగా షేర్ వస్తుందని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. ఇదిలావుండగా నైజాం ఏరియాలో తొలిరోజు 5కోట్ల షేర్ లభిస్తుందని, ఒక్క హైదరాబాద్‌లోనే మూడుకోట్ల వసూళ్లను సాధిస్తుందని అంటున్నారు.


ఇవన్ని అఫీషియల్ లెక్కలు కాక పోయినా...ఇప్పటి వరకు జరిగిన భారీ అడ్వాన్స్ బుకింగ్ నేపథ్యంలో ట్రేడ్ విశ్లేషకులు ఈ అంచనాలకు వచ్చారు. మరో వైపు ఈ రోజు విడుదలైన బాహుబలి సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే సినిమా తెరకెక్కించిన తీరు గొప్పగా ఉందని అంటున్నారు.

English summary
Baahubali 1st day collection report.
Please Wait while comments are loading...