»   » రానా కంటే ప్రభాసే సెక్సీ.. ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు.. అనుష్క

రానా కంటే ప్రభాసే సెక్సీ.. ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు.. అనుష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన బాహుబలి2 సినిమాలో ప్రతీ పాత్ర ప్రత్యేకమైనది. ప్రధానంగా అమరేంద్ర బాహుబలి, దేవసేన పాత్రల చిత్రీకరణ, వారి మధ్య కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల బాహుబలి2 ప్రయోషన్ సందర్భంగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవసేన పాత్రధారి అనుష్క చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అనుష్క ఫ్యాన్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఇంతకు ఆ వీడియోలో అనుష్క ఏమన్నారంటే..

అలా నటించడం కష్టమైంది.

అలా నటించడం కష్టమైంది.

అమరేంద్ర బాహుబలి ప్రియురాలిగా, అలాగే మహేంద్ర బాహుబలికి తల్లిగా నటించడం నా నట జీవితంలో నటించడం చాలా కష్టమైంది. అదో సవాల్‌గా కనిపించింది. అయితే దర్శకుడు రాజమౌళి కారణంగా ఆ పాత్రలను పోషించడం సులభమైంది అని అనుష్క తెలిపింది.

ప్రభాస్ సెక్సీ..

ఇంటర్వ్యూ సందర్భంగా రానా, ప్రభాస్‌లో ఎవరు సెక్సీగా ఉంటారు? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రానా దగ్గుబాటి కంటే ప్రభాస్ ఎక్కువగా సెక్సీగా ఉంటాడు అని అనుష్క జవాబిచ్చింది. అంతేకాకుండా రానా నన్ను బ్రదర్ అని పిలిస్తాడు. నేను అతడ్ని కూడా నేను బ్రదర్ అని పిలుస్తాను అని అనుష్క వివరించింది. దానికి సమాధానంగా అనుష్కను బ్రదర్ పిలిసే సాహసం ఎవరికైనా ఉంటుందా అని కనుబొమ్మలు ఎగురవేసింది.

ప్రభాస్, అనుష్క కెమిస్ట్రీ..

ప్రభాస్, అనుష్క కెమిస్ట్రీ..

టాలీవుడ్‌లో ప్రభాస్, అనుష్క జంటకు మంచి ఆదరణ ఉంది. గతంలో ప్రభాస్‌తో కలిసి మిర్చి, బిల్లా చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నాయి. తాజాగా బాహుబలి సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే.

1500 కోట్ల వసూళ్లు..

1500 కోట్ల వసూళ్లు..

ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి2 సినిమా దాదాపు రూ.1500 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. విదేశాల్లోనూ బాహుబలి2 సినిమా మంచి కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్ర కలెక్షన్ల జోరు ఏ మాత్రం తగ్గకపోవడం బాహుబలి2 సినిమాకు ఉన్న ప్రజాదరణను చెప్పకనే చెప్పింది.

English summary
Anushka Shetty said she found Prabhas more sexy than Rana Daggubati. The video clip, which was shared by Anushka's fan page, has gone viral on the internet. Prabhas and Anushka Shetty have previously worked in Mirchi and Billa. Needless to say, they're the most sought-after on-screen pairs in Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more