»   » ‘బాహుబలి-2’ బిజినెస్ గురించి ఈ న్యూస్ ఎవరూ ఊహించి ఉండరు..అందరూ షాక్

‘బాహుబలి-2’ బిజినెస్ గురించి ఈ న్యూస్ ఎవరూ ఊహించి ఉండరు..అందరూ షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైద్రాబాద్: 2015లో విడుదలైన 'బాహుబలి' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు సాధించింది. దీనికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న 'బాహుబలి- ది కంక్లూజన్‌' ఈ ఏడాది ప్రథమార్థంలోనే, ఏప్రియల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ గురించిన ఓ వార్త ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతూ షాక్ ఇస్తోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్లు ని టచ్ చేయనుంది. ఏ ఇండియన్ సినిమా కూడా ఈ స్దాయి క్రేజ్ తెచ్చుకోలేదని, ముఖ్యంగా భారత్ దేశంలో ఏ సినిమా కూడా 300 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ దాటలేదని చెప్తున్నారు. దాంతో బాహుబలి 2 రికార్డ్ నిలిచిపోనుంది.


అయితే ఇండియాలో ఇప్పటివరకూ ఏ సినిమా చేయని ఫీట్ బాహుబలి 2 ఎలా చేస్తుందనే సందేహం మీకు ఉండవచ్చు. కానీ మీరు ఈ క్రింద లెక్కల చూస్తే మీరు నిజమే అని ఒప్పుకుంటారు. ఏరియాల వైజ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ని మీరు గమనించండి...


125 కోట్లు

125 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ధియోటర్ రైట్స్ బాహుబలి 2 కు 125 కోట్లు వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందని సమాచారం. ముఖ్యంగా నైజాం నుంచి ఎక్కువ బిజినస్ జరిగింది. అలాగే ఆంధ్రాలో కూడా కొన్ని రాష్టాల్లో పోటీ పడి మరీ ఈ చిత్రం పంపిణీ రైట్స్ తీసుకున్నారు


300 కోట్లు ఇక్కడే

300 కోట్లు ఇక్కడే

మూడు దక్షిణాది రాష్టాలు అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ కలిసి 90 కోట్లు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అలాగే నార్త్ కానీ మిగతా సౌత్ స్టేట్ ధియోటర్స్ లో 210-215 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది.


హిందీ ధియోటర్ రైట్స్ తో కలిసి

హిందీ ధియోటర్ రైట్స్ తో కలిసి

నార్త్ ఇండియా ..హిందీ ధియోటర్ రైట్స్ తో కలిసి 80 కోట్ల వరకూ బిజినెస్ జరిగిందని అంచనా. బాహుబలి నార్త్ ఇండియాలోనూ సంచలన విజయం సాధించటం ఈ సీక్వెల్ పార్ట్ బిజినెస్ కు ప్లస్ అయ్యింది.


యుఎస్ లో ..

యుఎస్ లో ..

బాహుబలి 2 కేవలం మన దేశంలోనే కాక ఓవర్ సీస్ లోనూ దుమ్ము రేపింది.ముఖ్యంగా మన తెలుగు వాళ్లు ఎక్కువ ఉండే అమెరికాలో 40 కోట్లు వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఈ మేరకు ఎగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది.


మిగతా ఓవర్ సీస్ అంతా..

మిగతా ఓవర్ సీస్ అంతా..

అమెరికా మినహాయించి మిగతా ఓవర్ సీస్ ప్రాంతం అంతా కలిసి తెలుగు, హిందీ ,తమిళ వెర్షన్స్ అంతా 20కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ మేరకు అన్ని ఏరియాల నుంచి ఫ్యాన్సీ ఆఫర్స్ రావటంతో బిజినెస్ క్లోజ్ చేసినట్లు సమాచారం.


350 కోట్లు

350 కోట్లు

బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ (ఇండియన్ లాంగ్వేజెస్ ) 350కోట్లు వరకూ జరిగినట్లు సమాచారం. ఇది ఓ తెలుగు సినిమాకు పెద్ద రికార్డ్ అనే చెప్పాలి. రాజమౌళి మీద ఉన్న నమ్మకం , ఈ రెండో సినిమా మీద ఉన్న అంచనాలతో ఈ స్దాయి బిజినెస్ జరిగింది.


శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్

శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్

ఇక బాహుబలి 2 చిత్రం శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ కూడా బాగా పలికాయి. అన్ని కలిపి, తెలుగు,తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 110 కోట్లు వరకూ వచ్చినట్లు సమాచారం. ఛానెల్స్ వారు మ్యూజిక్ కంపెనీలు ఈ రైట్స్ ని పోటీ పడి మరీ సొంతం చేసుకున్నారు.


ఇంటర్నేషనల్ వెర్షన్స్

ఇంటర్నేషనల్ వెర్షన్స్

పైన చెప్పుకున్నవన్నీ కాక ఈ సినిమాకు మరో కొత్త బిజినెస్ యాడ్ అయ్యింది. అది బాహుబలి 2 ఇంటర్నేషనల్ వెర్షన్స్ బిజినెస్. విరుట్యువల్ రియాలటీ, బుక్స్, టీవి సీరియస్, యానిమేటెడ్ వెబ్ సీరిస్ అన్ని డీల్స్ కలిసి 50 కోట్లు వరకూ పలికాయి.


ఫైనల్ గా ఇదీ బిజినెస్

ఫైనల్ గా ఇదీ బిజినెస్

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ లాంగ్వేజెస్, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, విరుట్యవల్ రియాలిటీ, బుక్స్,కామిక్స్ అన్నీ కలిపి 500 కోట్లు పైగానే ఈ చిత్రానికి బిజినెస్ జరిగిందని ప్రాధమిక అంచనా.


ఫీవర్ పెరుగుతోంది

ఫీవర్ పెరుగుతోంది

రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి-2' ఫీవర్ క్రమంగా పెరుగుతూ పోతోంది. 'బాహుబలి' (ది బిగినింగ్) సస్పెన్స్‌తో ముగించడం...ఈ సస్పెన్స్‌కు బాహుబలి-2 (ది కంక్లూజన్)తో తెరదించనుండటంతో సహజంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాదిలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకబికిన జరుగుతున్నాయి.


విశేషంగా ఆకట్టుకుంది

విశేషంగా ఆకట్టుకుంది

రీసెంట్ గా రిపబ్లిక్ డేను పురస్కరించుకొని బాహుబలి-2 చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఎస్ఎస్ రాజమౌళి ట్వీటర్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్, అనుష్క విల్లును సంధిస్తున్నట్టు ఉన్న ఫొటో తొలిచూపులోనే అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమరేంద్ర బహుబలి, దేవసేనకు సంబంధించిన చిత్రమని, బాహుబలి2లో మోస్ట్ ఆర్టిస్టిక్ సీక్వెన్సెస్ అని రాజమౌళి భారీ అంచనాలు పెంచారు.


మార్కెటింగ్ పరంగా

మార్కెటింగ్ పరంగా

ఇక భారత చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చారిత్రక చిత్రం 'బాహుబలి-2' ఇటు పబ్లిసిటీలోనే కాదు, మార్కెటింగ్ పరంగానూ సంచలనాలకు కేంద్ర బిందువవుతోంది. ఈ చిత్రం తమిళ రైట్స్‌ పెద్దమొత్తానికి అమ్ముడుపోయినట్టు సమాచారం.


డీల్ సీల్ చేసారు

డీల్ సీల్ చేసారు

థియేటర్ రిలీజ్ హక్కులను శ్రీ గ్రీన్ ప్రొడక్షన్ హౌస్ దక్కించుకున్నట్టు కోలీవుడ్ వర్గాల భోగట్టా. ఆసక్తికరంగా రజనీకాంత్ సినిమాలకు ఆఫర్ చేసే మొత్తం కంటే ఇది కొద్దిగా తక్కువే అయినా, తమిళంలో ఇతర అగ్రహీరోల సినిమాల రైట్స్‌కు ఆఫర్ చేసే మొత్తం కంటే ఎక్కువని, సదరు ప్రొడక్షన్ హౌస్ ఈ మేరకు బాహుబలి నిర్మాతలకు ఆఫర్ ఇచ్చి డీల్ 'సీల్' చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది.


51 కోట్లు కు ..

51 కోట్లు కు ..

'బాహుబలి-2' హిందీ శాటిలైట్ హక్కులను 'సోనీ నెట్ వర్క్' ఎగురేసుకుపోయింది. ఇందుకు గాను నిర్మాతలకు రూ.51 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఒక డబ్బింగ్ చిత్రానికి, అందులోనూ ఓ ప్రాంతీయ చిత్రాన్ని టీవీల్లో ప్రసారం చేసేందుకు ఇంతవరకూ ఇంతపెద్ద మొత్తం చెల్లించడం ఇదే ప్రథమమని బాలీవుడ్ వర్గాల భోగట్టా.


అన్ని స్టూడియోల్లో..

అన్ని స్టూడియోల్లో..

''పదిహేను నెలలుగా అల్మోస్ట్‌ ఇండియాలోని మేజర్‌ వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోలలో 'బాహుబలి: ద కంక్లూజన్‌' విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 33 కంటే ఎక్కువ స్టూడియోలు 'బాహుబలి-2' నిర్మాణానంతర కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. మా అందరి లక్ష్యం ఒక్కటే... విడుదల దిశగా దూసుకువెళ్తున్నాం'' అని కమల్‌కణ్ణన్‌ పేర్కొన్నారు.


ఫుల్ స్టాప్ పెట్టినట్లే

ఫుల్ స్టాప్ పెట్టినట్లే

ముందుగా ప్రకటించినట్టు ఏప్రిల్‌ 28న బాహుబలి 2 సినిమా విడుదల చేస్తారా? లేదా? అనే సందేహం కొందరిలో ఉంది. ఎందుకంటే... సకాలంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ పూర్తి కాకపోవడంతో 'బాహుబలి' చిత్రాన్ని అనుకున్న టైమ్‌కి విడుదల చేయలేకపోయారు.ఇప్పుడూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అవుతుందా? అనే సందేహం రావడం సహజమే! ఈ డౌట్‌లకు 'బాహుబలి-2' విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ కమల్‌కణ్ణన్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టారు.


English summary
Trade analysts expect the Pre-Release Business of 'Baahubali: The Conclusion' to touch Rs 500 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu