For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చైనాలో బాహుబలి2కు షాక్.. రిలీజ్ ‌గురించి పట్టించుకోవడం లేదట..

  By Rajababu
  |

  బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ నటించిన దంగల్ చిత్రం చైనాలో చరిత్ర సృష్టించింది. విదేశీ గడ్డపై రూ.1000 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన తొలి చిత్రంగా దంగల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. మే 5వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణను చూరగొంటున్నది. సాధారణ ప్రేక్షకుల నుంచి దేశ అధ్యక్షడి వరకు దంగల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారతీయ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనం పడుతున్న నేపథ్యంలో చైనాలో బాహుబలి2ను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న బాహుబలి2 చిత్రంపై అంతగా స్పందన కనిపించడం లేదనే తాజా సమాచారం.

   ప్రధాని మోదీ దృష్టికి దంగల్ రికార్డులు

  ప్రధాని మోదీ దృష్టికి దంగల్ రికార్డులు

  ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళ్లాడు. ఆ పర్యటనలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యాడు. సాధారణంగా దౌత్యపరమైన విషయాలు చర్చకు రావడం సహజం. అయితే ఇందుకు భిన్నంగా నేను భారతీయ చిత్రం దంగల్ చూశాను అని ప్రధాని మోదీకి జిన్‌పింగ్ చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని బట్టి అమీర్ ఖాన్ సినిమా చైనా ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపించిందో అర్థమవుతున్నది.

  ఉద్వేగభరితమైన కథకు జన నీరాజనం

  ఉద్వేగభరితమైన కథకు జన నీరాజనం

  కుస్తీపోటీలలో కూతుళ్లను ప్రపంచ విజేతలు చేయడానికి ఓ కుస్తీ వీరుడు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి చైనా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఏకంగా రూ.1000 కోట్లు వసూలు చేసింది. దేశంలో ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్ల కంటే ఎక్కువే. ఈ చిత్రాన్ని చైనా ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తున్నారు.

  దంగల్ అరుదైన రికార్డు

  దంగల్ అరుదైన రికార్డు

  చైనాలో ప్రభంజనం తర్వాత దంగల్ చిత్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వసూళ్లను సాధించిన ఐదో ఆంగ్లేతర చిత్రంగా దంగల్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో బాహుబలి2 తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమవుతున్నది.

  వీఎఫ్ఎక్ష్‌పై ఆసక్తి ప్రదర్శించని చైనా వాసులు

  వీఎఫ్ఎక్ష్‌పై ఆసక్తి ప్రదర్శించని చైనా వాసులు

  చైనా ప్రేక్షకులపై హాలీవుడ్ చిత్రాల ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్, అత్యంత సాంకేతిక విలువ ఉన్న చిత్రాలను వారు ఇంతకు ముందే చూశారు. వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ ఎక్కువ స్థాయిలో ఉపయోగించిన ఈ చిత్రంపై అంతగా ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదనేది ప్రస్తుత పరిస్థితిని బట్టి అంచనా వేస్తున్నారు. టెక్నికల్‌గా ఎక్కువ ప్రధాన్యమున్న చిత్రాల కంటే వాస్తవికతను, ఉద్వేగానికి గురిచేసే చిత్రాలను ఆదరిస్తారనేది గతంలో రుజువు అయ్యాయి. ప్రస్తుతం దంగల్ చిత్రం కూడా రుజువు చేసింది.

  బాహుబలి1 పేలవమైన వసూళ్లు

  బాహుబలి1 పేలవమైన వసూళ్లు

  చైనా ప్రేక్షకుల అభిరుచి ఏ మేర ఉందోననే విషయం బాహుబలి1 చెప్పకనే చెప్పింది. 2016 విడుదలైన బాహుబలి చిత్రం చైనాలో కేవలం రూ.75 కోట్లు వసూలు చేయడం గమనార్హం. కానీ దానికి భిన్నంగా దంగల్ చిత్రం రూ.1000 కోట్లు వసూలు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలో బాహుబలి2 ఆ స్థాయి కలెక్షన్లు సాధిస్తుందా? అనే సందేహం ప్రస్తుతం ట్రేడ్ అనలిస్టుల్లో రేకెత్తుతున్నది.

  సెప్టెంబర్లో విడుదల

  సెప్టెంబర్లో విడుదల

  చైనాలో బాహుబలి2 చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా తెలిపారు. ఈ సినిమాను దాదాపు 4 వేల స్క్రీన్లలో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్ గురించి ప్రభాస్, రానా, అనుష్క తదితరులు చైనాకు వెళ్లనున్నారని ఆయన పేర్కొన్నారు.

  English summary
  What is also important here is the kind of business Baahubali 2's predecessor, Baahubali, did in China. The film was released in the country in 2016, after a delay of several months. Baahubali: The Beginning earned a total of about Rs 75 crore in China. In the post-Dangal era in China, that figure looks strangely tiny. Dangal, after all, has gone on to earn Rs 1000 crore in China. And the cash registers haven't yet stopped ringing.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X