»   » బంగ్లాదేశ్‌కు బాహుబలి సెగ.. చార్టెడ్ ఫ్లయిట్‌లో ఇండియాకు.. సినిమా పిచ్చి అంటే మజాకా..?

బంగ్లాదేశ్‌కు బాహుబలి సెగ.. చార్టెడ్ ఫ్లయిట్‌లో ఇండియాకు.. సినిమా పిచ్చి అంటే మజాకా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్ల వద్ద జనాలు క్యూ కట్టడం సంచలనంగా మారుతున్నది. రిలీజ్ అయి ఐదు రోజులు దాటినా ఈ సినిమాకి ప్రేక్షకుల తాకిడి తగ్గకపోగా.. మరింత క్రేజ్ పెరుగుతున్నది. రానా, ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణ నటించిన బాహుబలి సినిమా హాలీవుడ్ నటులు టామ్ హాంక్స్, ఎమ్మా వాట్సన్ నటించిన ది సర్కిల్ సినిమా కలెక్షన్లను బాక్సాఫీస్‌ వద్ద అధిగమించడం రికార్డుగా చెప్పుకొంటున్నారు. తాజాగా ఈ సినిమాని చూడటానికి బంగ్లాదేశ్ నుంచి పలువురు ఇండియాకు రావడం సంచలన వార్త అయింది.

ఢాకా నుంచి చార్టెడ్ ఫ్లయిట్‌లో..

ఢాకా నుంచి చార్టెడ్ ఫ్లయిట్‌లో..

ఇదిలా ఉంటే బాహుబలి సెగ ముస్లిం సంప్రదాయ దేశం బంగ్లాదేశ్‌కు తాకింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సినిమాను చూడటానికి దాదాపు 40 మంది సినీ అభిమానులు భారత్‌కు రావడం విశేషంగా మారింది. 40 మంది కూడిన ప్రత్యేక బృందం చార్టెట్ ఫ్లయిట్‌లో సోమవారం ఢాకా నుంచి కోల్‌కతాకు చేరుకొన్నారు. దక్షిణ కోల్‌కతాలోని మల్టిప్లెక్స్‌లో ఈ సినిమాను చూసి కొత్త అనుభూతికి గురయ్యారు.


రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాం..

రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాం..

బాహుబలిని కట్టప్పను ఎందుకు చంపారో అనే విషయాన్ని తెలుసుకోవడానికి గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం. నేను బాహుబలి వీర అభిమానిని. సాయంత్రం ఫస్ట్ షో చూడటానికి సోమవారం ఉదయం ఫ్లయిట్ తీసుకొని కోల్‌కతాకు చేరుకొన్నాం అని బంగ్లాదేశ్ చెందిన సినీ అభిమాని ఒకరు వెల్లడించారు.


ఆ ప్రశ్న వెంటాడింది..

ఆ ప్రశ్న వెంటాడింది..

బాహుబలి1 సంచలన విజయం సాధించింది. పార్ట్1లో బాహుబలిని ఎందుకు చంపారనే ప్రశ్న మమ్మల్ని వెంటాడుతున్నది. దాంతో బాహుబలి2 చూడాలనే ఆసక్తి పెరిగింది. ఇండియాలోని చాలా మంది స్నేహితులు సినిమా చూశారు. ఆ ప్రశ్నకు సమాధానంచ చెప్తామంటే మేము సినిమా చూస్తాం చెప్పవద్దు అని కోరామని ఫర్జానా బ్రోనియా అన్నారు.


బాహుబలి చూసిన తర్వాత..

బాహుబలి చూసిన తర్వాత..

ఈ సినిమా చూడటం కోసం హసన్ ఖాన్ అనే పారిశ్రామిక వేత్త తన కుమారుడు, కూతురుతో కలిసి ఢాకా నుంచి కోల్‌కత్తాకు వచ్చారు. బంగ్లాదేశీయులకు బాలీవుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. సౌత్ ఇండియా సినిమాల గురించి పెద్దగా తెలియదు. సౌత్ ఇండియాలో రూపొందిన సినిమాలు పెద్దగా చూడలేదు. బాహుబలి1 చూసిన తర్వాత నోట మాట పెగల్లేదు. హలీవుడ్ సినిమాలకు స్థాయిగా సినిమా రూపొందింది అని ఓ బంగ్లా అభిమాని చెప్పారు.


ఊహ తెలిసినప్పటి నుంచి..

ఊహ తెలిసినప్పటి నుంచి..

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఓ సినిమాకు ఇలాంటి స్పందన వచ్చిన దాఖలాలు లేవు. బెంగాల్ చరిత్రలో ఇంత కలెక్షన్లు వసూలు చేసిన సినిమాను నేనింత వరకు చూడలేదు. ప్రేక్షకులు భారీగా వస్తుండటంతో ఉదయం 7.30 గంటలకే మొదటి ఆటను ప్రారంభిస్తున్నాం అని ఈస్ట్ ఇండియాలోని ఐనాక్స్ డైరెక్టర్ సుభాశీస్ గంగూలీ వెల్లడించారు.English summary
Over 40 Bangladeshi fans flew down to Kolkata to find out the answer to why Kattappa killed Baahubali. The group flew down to Kolkata in a chartered flight on Monday from Dhaka to catch the evening show of the film at a south Kolkata multiplex.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu