»   » ఆల్‌టైమ్ ఇండియన్ టాప్ 10 గ్రాసర్స్.... ఇదీ బాహుబలి-2 పొజిషన్!

ఆల్‌టైమ్ ఇండియన్ టాప్ 10 గ్రాసర్స్.... ఇదీ బాహుబలి-2 పొజిషన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి' మూవీ సిరీస్ ఇండియన్ సినీ చరిత్రలో వచ్చిన ఓ అద్భుతం. గతవారం విడుదలైన 'బాహుబలి-2' మూవీ బాక్సాఫీసు సంచలనాలు నమోదు చేస్తూ దూసుకెలుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండియన్ టాప్ 10 గ్రాసర్స్ లిస్టులో చోటు దక్కించుకుంది.

బాహుబలి-2 ఫుల్ రన్ లో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి నెం.1 స్థానం దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి రూ. 740 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో అమీర్ ఖాన్ 'పికె' మూవీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో రూ. 705 కోట్లతో అమీర్ ఖాన్ నటించిన మరో మూవీ దంగల్ ఉంది.


రూ. 1000 కోట్ల మార్కును దాటేయడం ఖాయం

రూ. 1000 కోట్ల మార్కును దాటేయడం ఖాయం

బాహుబలి-2 రిలీజ్ ముందు వరకు ఈ చిత్రం రూ. 1000 కోట్ల మార్కును అందుకుంటుందని అంతా అంచనా వేసారు. అయితే సినిమా విడుదల తర్వాత కలెక్షన్ల జోరు చూస్తుంటే ఈ చిత్రం ఫుల్ రన్ లో రూ. 1250 కోట్ల నుండి రూ. 1500 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


తొలి నాలుగు రోజుల్లోనే రూ. 600 కోట్లు

తొలి నాలుగు రోజుల్లోనే రూ. 600 కోట్లు

‘బాహుబలి-2' మూవీ విడుదలై తొలి 4 రోజుల్లోనే అన్ని బాషల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లకు చేరువైంది. రెండో వారం పూర్తయ్యే సమయానికి ఈ చిత్రం రూ. 1000 కోట్లను క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు.... ఇండియాలో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి.


పికె

పికె

అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ‘పికె' మూవీ రూ. 740 కోట్ల వసూళ్లతో ఇప్పటి వరకు ఇండియాలో టాప్ పొజిషన్లో ఉంది.
దంగల్

దంగల్

అమీర్ ఖాన్ నటించిన మరో మూవీ ‘దంగల్' రూ. 705 కోట్ల వసూల్లతో రెండో స్థానంలో ఉంది.
బజరంగీ భాయి జాన్

బజరంగీ భాయి జాన్

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘భజరంగీ భాయిజాన్' మూవీ రూ. 605 కోట్లతో మూడో స్థానంలో ఉంది.


బాహుబలి-ది బిగినింగ్

బాహుబలి-ది బిగినింగ్

2015లో విడుదలైన ‘బాహుబలి-ది బిగినింగ్' రూ. 600 కోట్ల పై చిలుకు వసూళ్లతో నాలుగో స్థానంలో ఉంది.


సుల్తాన్ మూవీ

సుల్తాన్ మూవీ

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ మూవీ రూ. 580 కోట్ల గ్రాస్ కలెక్షన్లో ఐదో స్థానంలో ఉంది.


ధూమ్ 2

ధూమ్ 2

అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ‘ధూమ్ 3' మూవీ రూ. 560 కోట్ల వసూళ్లతో ఆరో స్థానంలో ఉంది.


3 ఇడియట్స్

3 ఇడియట్స్

బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ అప్పట్ో రూ. 395 కోట్లు వసూలు చేసి ఇంకా టాప్-10లో కొనసాగుతోంది.


చెన్నై ఎక్స్ ప్రెస్

చెన్నై ఎక్స్ ప్రెస్

షారుక్ ఖాన్ మూవీ చెన్నై ఎక్స్ ప్రెస్ రూ. 393 కోట్లకుపైగా వసూలు చేసి టాప్ 10 పొజిషన్లో కొనసాగుతోంది.English summary
Boxoffice reports said that, 'Baahubali 2' full run gross is expected to cross Rs 1,250 crore. Even Rs 1,500 crore is very much possible if the revenue in the first four days is any indication.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu