Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
9500 థియేటర్లలో బాహుబలి2.. పెరుగుతున్న ఉత్కంఠ.. కనివినీ ఎరుగని విధంగా విశేషాలు..
రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్ది బాహబలి ది కన్‌క్లూజన్‌పై ఉత్కంఠ పెరుగుతున్నది.
రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్ది బాహబలి ది కన్‌క్లూజన్‌పై ఉత్కంఠ పెరుగుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా, కనీ విని ఎరుగని లెక్కన తెలుగు చిత్రమైన బాహుబలి2 ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల అవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బాహుబలి2 చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 28) రోజున విడుదలకు సిద్ధమవుతున్నది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రాథమిక సమాచారం ప్రకారం బాహుబలి2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 వేల థియేటర్లలో రిలీజ్ కానున్నది. దేశంలో దాదాపు 6500 థియేటర్లలో విడుదల అవుతుండగా అమెరికాలో 1100 థియేటర్లలో రిలీజ్ కానున్నది. మిగితా దేశాల్లో మొత్తం 1400 థియేటర్లలో ప్రదర్శించే చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది.
తొలివారంలోనే కనక వర్షం
అత్యంత ప్రతిష్థాత్మకంగా తెరకెక్కిన బాహుబలి2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలివారమే బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిసే అవకాశముందనే అభిప్రాయం ట్రేడ్ అనలిస్టుల నుంచి వ్యక్తమవుతున్నది. దేశ చరిత్రలోనే తొలిసారి బాహుబలి2 చిత్రం రూ.1000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.
ఐమాక్స్ ఫార్మాట్లో..
బాహుబలి2 సాంకేతికంగా మరో అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందిన మూడో చిత్రంగా ఘనతను సొంతం చేసుకొన్నది. అమెరికాలో 40 ఐమాక్స్ స్క్రీన్లలో విడుదల అవుతున్నది. ఇంకా ఐమాక్స్ థియేటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
కేరళలో భారీ క్రేజ్
దక్షిణాదిలో బాహుబలి2 చిత్రంపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేరళలో ప్రధానంగా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కేరళలో తొలిరోజు రూ.5 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకలోను అదే పరిస్థితి కనిపిస్తున్నది.