twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి-2’ చిత్రానికి మరో అంతర్జాతీయ పురస్కారం

    By Bojja Kumar
    |

    రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి'కి దేశీయంగా, అంతర్జాతీయంగా ఇప్పటికే ఎన్నో అవార్డులు దక్కాయి. తాజాగా మరో అంతర్జాతీయ పురస్కారం బాహుబలి-2ని వరించింది. 44వ శాటర్న్ అవార్డుల ప్రదానోత్సవంలో 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' 'ఉత్తమ అంతర్జాతీయ చిత్రం' కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది.

    అకాడెమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసరీ & హారర్ ఫిల్మ్స్ అనే అంతర్జాతీయ సంస్థ 1972 నుండి సైన్స్ ఫిక్షన్, ఫాంటసరీ, హారర్ విభాగాల్లో బెస్ట్ సినిమాలు, టెలివిజన్ సిరీస్‌లకు శాటర్న్ అవార్డుల పేరుతో పురస్కారాలు అందజేస్తూ వస్తోంది.

    బుధవారం జరిగిన 44వ శాటర్న్ అవార్డుల వేడుకలో ఫిబ్రవరి 2017 నుంచి ఫిబ్రవరి 2018 మధ్య విడుదలైన చిత్రాల్లో విశేషంగా ప్రేక్షకులను అలరించిన వాటికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో బాహుబలి-ది కంక్లూజన్ అవార్డు దక్కించుకుంది.

     Baahubali 2 gets Saturn Award 2018

    అవార్డులు అందుకున్న చిత్రాలు

    బెస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్: బ్లేడ్ రన్నర్ 2049
    బెస్ట్ కామిక్-టు-ఫిల్మ్ మోషన్ పిక్చర్: బ్లాక్ పాంథర్
    బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్: ది షేప్ ఆఫ్ వాటర్
    బెస్ట్ హారర్ ఫిల్మ్: గెట్ ఔట్
    బెస్ట్ యాక్షన్/అడ్వంచర్ ఫిల్మ్: ది గ్రేటెస్ట్ శాడోమ్యాన్
    బెస్ట్ థ్రిల్లర్ ఫిల్మ్: త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్ సౌడ్ ఇబ్బింగ్, మిస్కోరి
    బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్: బాహుబలి2: ది కంక్లూజన్
    బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్: కోకో
    బెస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్: వండర్

    English summary
    The 44th edition of Saturn Awards was announced on Wednesday and the list included Baahubali 2 alongside blockbuster Hollywood biggies like Black Panther, Blade Runner 2049, The Shape of Water , CoCo etc.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X