»   » రాజమౌళి దేవుడి బిడ్డ అంటూ.... రజనీకాంత్ ట్వీట్

రాజమౌళి దేవుడి బిడ్డ అంటూ.... రజనీకాంత్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి-2' సినిమా గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికంగా ట్వీట్ చేసారు. భారతీయ సినీరంగం గర్వించే చిత్రం 'బాహుబలి-2'. దేవుడి బిడ్డ రాజమౌళికి, అతడి బృందానికి నా ధన్యవాదాలు. బాహుబలి అనేది మాస్టర్ పీస్ అంటూ రజనీకాంత్ ట్వీట్ చేసారు.

రజనీకాంత్ ట్వీట్ పై రాజమౌళి స్పందిస్తూ "తలైవా... నన్ను దేవుడే స్వయంగా ఆశీర్వదించినట్టుగా ఉంది. మా టీమ్ మొత్తం మీ అభినందనతో గాల్లో విహరిస్తోంది. మరే అభినందనా ఇంతకంటే గొప్పగా ఉండబోదు" అంటూ చేతులెత్తి నమస్కరిస్తూ ట్వీట్ చేసారు రాజమౌళి.

రజనీకాంత్ ట్వీట్

రజనీకాంత్ ట్వీట్

రాజమౌళిని రజనీకాంత్ దేవుడి బిడ్డగా అభివర్ణించడం చర్చనీయాంశం అయింది. సినిమా బావుందని మెచ్చుకోవడం వేరు, దేవుడి బిడ్డగా పొగడ్తలు గుప్పించడం వేరు. మరి రజనీకాంత్ ఏ ఉద్దేశ్యంతో ఇలా ట్వీట్ చేసారో? అని అంతా చర్చించుకుంటున్నారు.

పవర్ ఆఫ్ ఇండియన్ మూవీ: నాగార్జున

పవర్ ఆఫ్ ఇండియన్ మూవీ: నాగార్జున

బాహుబలి-2 పవర్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఇన్ క్రెడబుల్ రష్ ఆఫ్ ఎమోషన్స్ అంటూ నాగార్జున ట్వీట్ చేసారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ బాహుబలి టీం తరుపున థాంక్స్ చెప్పారు.

ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మూవీ: డైరెక్టర్ శంకర్

ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మూవీ: డైరెక్టర్ శంకర్

ఇప్పుడే బాహుబలి-2 చూసాను. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మూవీ. రాజమౌళికి హాట్సాఫ్ అంటూ ప్రముఖ దర్శకుడు శంకర్ ట్వీట్ చేసారు.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

రాజమౌళికి, కరణ్ జోహార్ కు కంగ్రాట్స్ చెబుతూ హీరోయిన్ ప్రియాంక చోప్రా ట్వీట్ చేసారు.

English summary
"Baahubali 2 ... indian cinema's pride. My salutes to God's own child ssrajamouli and his team!!! #masterpiece" Rajinikanth tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu