twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాంతో పోలిస్తే ‘బాహుబలి’ చాలా చిన్నది: రాజమౌళి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి సినిమాతో తన సత్తా ఏమిటో నిరూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి. హాలీవుడ్ స్థాయి సినిమాలు తీయగలిగే సత్తా ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కి కూడా ఉందని చాటి చెప్పాడు. ప్రస్తుతం ఆయన ‘బాహుబలి' పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు.

    'మహాభారతం' ఆధారంగానే బాహుబలి స్టోరీ తయారు చేసుకున్నట్లు, రాబోయ బాహుబలి సెకండ్ పార్ట్ కు ఆధారం కూడా మహాభారతమే' అని గతంలో చెప్పుకొచ్చారు రాజమౌళి. బాహుబలి అనే సినిమా రాజమౌళికి ఇంటర్నేషనల్ గా గుర్తింపు తెచ్చింది. మహాభారతాన్ని సినిమాగా తీయాలనే ఆలోచన కూడా రాజమౌళి మదిలో ఉంది.

    Baahubali-2 is going to roll from December

    అయితే ఈ సినిమా తీయడం అంత సులువు కాదంటున్నాడు రాజమౌళి. బాహుబలి సినిమా హిట్టయినంత మాత్రాన ‘మహాభారతం' సినిమా తీయడం ఈజీ అనుకుంటే పొరపాటే. ‘నాపై అభిమానంతో కొందరు అలా అంటున్నారు. కానీ నా మదిలో ఉన్న మహాభారతం అనేది చాలా పెద్దది.. దానితో పోల్చుకుంటే బాహుబలి అనేది చాలా చిన్నది. లాగే మహా భారతాన్ని తీయడానికి నాకున్న అనుభవం మరియు టెక్నికల్ నాలెడ్జ్ సరిపోదు. ఇంకా నేర్చుకోవాలని' అన్నారు.

    ‘బాహుబలి-ది కంక్లూజన్' షూటింగ్ విషయాల్లోకి వెళితే.... ప్రస్తుతం రాజమౌళి అండ్ టీం ప్రీ ప్రొడక్షన్ పనుల మీద బిజీగా గడుపుతున్నారు. డిసెంబర్ 14 నుండి షూటింగ్ మొదలు కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగుకు సంబంధించిన సెట్టింగ్స్ రెడీ అవుతున్నాయి.

    బాహుబలి పార్ట్ 1 విజయం అందించిన ఉత్సాహంతో రాజమౌళి అండ్ టీం సెకండ్ పార్ట్ ను మరింత అద్భుతంగా తీయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. సెకండ్ పార్ట్ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటుందని, గతంలో ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని అనుభూతి ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు పొందుతారని అంటున్నారు.

    English summary
    The much awaited sequel of director Rajamouli’s magnum opus Baahubali is going to roll from December. Already the 40% of the film was shot simultaneously with the prequel and it is learnt that the makers planning to resume the shooting of Baahubali: The Conclusion from December 14.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X