»   » రానా ఓ ఇడియట్.. మతిలేని వ్యక్తి.. నోరుపారేసుకొన్న బాలీవుడ్ నటుడు!

రానా ఓ ఇడియట్.. మతిలేని వ్యక్తి.. నోరుపారేసుకొన్న బాలీవుడ్ నటుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు, రచయిత, నిర్మాత కమల్ రషీద్ ఖాన్ మరోసారి నోటి దురుసును బయటపెట్టుకొన్నాడు. బాహుబలి నటుడు రానా దగ్గుబాటిపై ట్విట్టర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. గతంలో కూడా కమల్ ఆర్ ఖాన్ రాజమౌళి, పవన్ కల్యాణ్, సమంతపై ట్విట్టర్‌లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

కేఆర్కే‌ను బ్లాక్ చేయడమే..

తాజా వివాదానికి కారణం ట్విట్టర్‌లో కమల్ ఆర్ ఖాన్‌ను రానా బ్లాక్ చేయడమే. దానిపై తీవ్రంగా స్పందించిన కమల్.. రానాపై నోరు పారేసుకొన్నాడు. రానాను ఇడియట్, బ్రెయిన్‌ లెస్ అంటూ దూషించాడు. ఇప్పటివరకు ఈ ఇడియట్‌ను కానీ, ఆయన ట్వీట్లను ఫాలో కాలేదు. అయినా నన్ను బ్లాక్ చేసి మతిలేని వ్యక్తి అని నిరూపించుకొన్నాడు అని కమల్ ట్వీట్ చేశాడు.

ఏడాది క్రితమే..

కమల్ ఆర్ ఖాన్ చేసిన వివాదాస్పద ట్వీట్‌పై రానా స్పందించాడు. తాను ఇప్పుడు బ్లాక్ చేయలేదు. ఏడాది క్రితమే నిన్ను బ్లాక్ చేశాను అని బదులిచ్చాడు. రానాకు పలువురు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. బాహుబలి2 చాలా బాగుంది. పాకీ పనిచేసే (కమల్ ఆర్ ఖాన్) మాటలను పట్టించుకోవద్దు అనే నిషిజ్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. పాకీ పనులు చేస్తున్న కమల్ ఖాన్ ఫొటోలను ట్విట్టర్‌లో ట్యాగ్ చేశాడు.

రాజమౌళిపై కూడా దురుసుగా..

ఇటీవల దర్శకుడు రాజమౌళిపై కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు కమల్ ఆర్ ఖాన్. బాహుబలి సినిమా చూసిన తర్వాత ట్విట్టర్‌లో మూడు గంటలు, రూ.3000 బాహుబలిపై అనవసరంగా ఖర్చు చేశాను. నీవు వెధవ పనిచేశానని చెప్పాలనుకొంటున్నావా అని నేను అడుగుతున్నాను అని ట్వీట్ చేశాడు.

నీవు చూతియా దర్శకుడు

బాహుబలి2 సినిమాతో నీవు ఈ దశాబ్దంలోనే చూతియా (చెత్త దర్శకుడు) డైరెక్టర్ అని బాహుబలితో రుజువు చేసుకొన్నావు. బాహుబలి లాంటి చెత్త సినిమాలు తీసినందుకు థ్యాంక్స్ అని ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది.

నాసిరకం సినిమాలతో కేఆర్కే..

నాసిరకం సినిమాలతో కేఆర్కే..

ఇలా ప్రముఖ దర్శకులను, నటులను టార్గెట్ చేసుకొని కమల్ ఆర్ ఖాన్ ఏమైనా గొప్ప సినిమాలు తీసారా అంటే అదీ లేదు. ఆయన నటించిన సినిమాలు, నిర్మించిన చిత్రాలు ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు పోయాయో ప్రేక్షకులకే తెలియదు. తన కెరీర్‌లో మున్నాపాండే బేరోజ్‌గార్ (భోజ్‌పూరి), ఏక్ విలన్ అనే సినిమాలో నటించాడు. దేశ్ ద్రోహి అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

English summary
Kamaal Rashid Khan called Baahubali 2 actor Rana Daggubati brainless and an idiot after he found himself blocked by the star on Twitter. KRK did not take to the blocking like an adult person. So he went on to trash Rana Daggubati by calling him 'brainless' and an 'idiot'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu