»   »  బాహుబలి 2: కాన్సెప్ట్ ఆర్ట్ లీకైంది (వీడియో)

బాహుబలి 2: కాన్సెప్ట్ ఆర్ట్ లీకైంది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి-ది బిగినింగ్' సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ చిత్రంగా పేరు తెచ్చుకుంది. రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ సినిమా తీయడానికి దర్శకుడు రాజమౌళి అండ్ టీం దాదాపు రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డారు.

ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ అండ్ టీం సినిమా షూటింగ్ మొదలవ్వడానికి సంవత్సరం ముందు నుండే దాదాపు 20 వేలకు పైగా స్కెచ్ లు వేసి, తర్వాత వాటి ఆధారంగా సెట్స్ వేసి సినిమాలో కీలక భూమిక పోషించారు. త్వరలో బాహుబలి-2 సినిమా కూడా రాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్ లీక్ అయింది.'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.


మొదటి సీన్ లో ...చేతిలో చంటిపిల్లాడు..వెనక వెంబడిస్తున్న శత్రువులు.. ఏం చేయాలో తెలియక శివగామి నేను చేసిన పాపాలు అంటుండగా సినిమా ప్రారంభంఅయ్యింది. పార్ట్-2లో శివగామి పూర్తి క్యారెక్టర్ తెలిసే అవకాశం ఉంది. శివగామి తన కుమారుడైన ...భళ్లాలదేవను కాదని.. అమరేంద్ర బాహుబలిని ఎందుకు రారాజుగా ప్రకటిస్తుంది. బిజ్జలదేవ మాటను లెక్కచేయకుండా మహేంద్ర బాహుబలిని ఎలా రక్షిస్తుంది? వంటి విషయాలు కన్‌క్లూజన్‌లో స్పష్టం కానున్నాయి!


Baahubali 2 Leaked Concept Art

దేవసేన (అనుష్క) గురించి బిగినింగ్‌లో తెలిసింది చాలా తక్కువ..అసలు ఆమెను ఎందుకు భళ్లాల దేవ చెర పట్టాడనేది స్పష్టత రానుంది. ఆ ప్లాష్ బ్యాక్ సెకండ్ పార్ట్ లో హైలెట్ కానుంది. భళ్లాల చెర నుంచి దేవసేనకు విముక్తి కల్పించేందుకు అవంతిక(తమన్నా) విపరీతంగా శ్రమించడం.. వీళ్లిద్దరికి ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది.అదేంటి అనేది రివిల్ కావాలి.


పార్ట్-1 బిగినింగ్‌లోనే నన్ను వద్దనుకున్నావ్.. వాడే కావాలనుకున్నావ్.. ఇప్పుడున్నాడా వాడు అని భళ్లాలదేవ దేవసేనను ఉద్దేశించి వెటకారంగా అంటాడు. దీనిని బట్టి దేవసేనను అమరేంద్ర బాహుబలి, భళ్లాలదేవ ఇద్దరూ ప్రేమించి ఉంటారని అర్థం అవుతున్నది. ఆ లవ్ స్టోరీ ఏంటి అనేది స్పష్టం కావాల్సి ఉంది.

English summary
Watch Baahubali 2 Leaked Concept Art.
Please Wait while comments are loading...