‘బాహుబలి-ది కంక్లూజన్’ లోగో ఆవిష్కరణ
హైదరాబాద్: ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన తారాగణంగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'బాహుబలి2'.
ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్లో శుక్రవారం రాత్రి జరిగింది. ముఖ్య ఎపిసోడ్స్ అన్నీ పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో కొన్ని రోజుల్లో సినిమా చిత్రీకరణ అంతా పూర్తి చేసేస్తాం. కొన్ని సీన్స్, సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉందని నిర్మాతలు తెలిపారు.

ఏప్రిల్ 28న బాహుబలి2 విడుదల చేయబోతున్నాం. వచ్చే ఏడాది, జనవరిలో సినిమా ట్రైలర్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. బాహుబలి లోగో ఆవిష్కరణ ప్రెస్ మీట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది లిక్ లో...
బాహుబలి-2 తో ఆగదు, వర్చువల్ రియాల్టీలో కూడా: ప్రెస్ మీట్లో రాజమౌళి, ప్రభాస్, రానా (ఫోటోస్)


Click it and Unblock the Notifications











