»   » బాహుబలి 2: అనుష్క రాయల్ లుక్, యువరాణి దేవసేన కేక...

బాహుబలి 2: అనుష్క రాయల్ లుక్, యువరాణి దేవసేన కేక...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి పార్ట్ 1లో అనుష్క లుక్ ఎంత అగ్లీగా ఉందో... చూడటానికి ఆమె లుక్ చాలా భయంకరంగా ఉండేది. అయితే పార్ట్ 2లో అనుష్క ఎంతో అందంగా కనిపించబతోంది. కథలో భాగంగా మొదటి పార్టులో అనుష్కను భయంకరమైన లుక్ లో చూపించారు. అయితే పార్ట్ 2లో మాత్రం అనుష్క చాలా అందంగా చూపించబోతున్నారు.

తాజాగా అనుష్కకు సంబంధించిన న్యూ లుక్ తో బాహుబలి 2 పోస్టర్ ఒకటి రిలీజైంది. ఇందులో కుంతలదేశ యువరాణిగా అనుష్క కనిపించబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా రిలీజ్ చేస్తున్న ఒక్కో పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది.


అనుష్క కాస్టూమ్స్ సూపర్

అనుష్క కాస్టూమ్స్ సూపర్

బాహుబలి సినిమాకు రమారాజమౌళి, ప్రశాంతి కాస్టూమ్స్ డిజైనర్స్ కమ్ స్టైలిస్ట్స్‌గా చేసారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల కంటే అనుష్కను ఇందులో ఎంతో అందంగా చూపించారు అనడానికి ఈ ఫోటయే సాక్ష్యం.


అందం మాత్రమే కాదు యాక్షన్

అందం మాత్రమే కాదు యాక్షన్

అనుష్క ఈ సినిమాలో కేవలం అందం పరంగానే కాదు.... యాక్షన్ సన్నివేశాల పరంగా కూడా ఎంతో ఆకట్టుకోబోతోంది. ముఖ్యంగా అనుష్క చేసే కత్తి యుద్దాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోబోతున్నాయి.


బాహుబలి, భల్లాలదేవతో సమానంగా దేవసేన

బాహుబలి, భల్లాలదేవతో సమానంగా దేవసేన

బాహుబలి మొదటి భాగంలో బాహుబలి, భల్లాలదేవ పాత్రలు పోటా పోటీగా ఉంటాయి. తాజాగా రెండో భాగంలో ఈ ఇద్దరి పాత్రలకు తోడు అనుష్క దేవసేన పాత్ర కూడా పెర్ఫార్మెన్స్ పరంగా వారితో పోటీ పడేలా ఉంటుంది.


బాహుబలి లీకైన స్టోరీ ఇదే..

బాహుబలి లీకైన స్టోరీ ఇదే..

బాహుబలి గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. సినిమా స్టోరీ లీకైనట్లు కూడా ఓ కథ ప్రచారంలోకి వచ్చింది. అందుకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Baahubali 2: Just before the release of the film, the makers excite the audience with a new look of their lead actors Prabhas and Anushka Shetty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu