twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' నిర్మాతలపై ఐటి దాడి గురించి మాట్లాడిన విజియేంద్రప్రసాద్

    By Srikanya
    |

    హైదరాబాద్: 'బాహుబలి' నిర్మాతల ఇళ్లపై ఐటీశాఖ ఆకస్మిక దాడులకు పాల్పడింది. ఏకకాలంలో నిర్మాతలు శోభుయార్లగడ్డ, ప్రసాద్ ఇళ్లపై రైడ్స్ నిర్వహించి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బ్లాక్ మనీ అనుమానాలతోనే ఈ దాడులు నిర్వహించినట్లు వార్తలు ప్రచారం జరిగింది. ఈ విషయమై బాహుబలి నిర్మాతల నుంచి ఏ విధమైన అఫీషియల్ ప్రకటన రాలేదు. అయితే ఈ చిత్రం రచయిత విజియేంద్రప్రసాద్ మాత్రం ఈ రైడ్స్ విషయమై మీడియా తో మాట్లాడారు.

    విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఈ ఐటీ రైడ్ అనేది తమ బాహుబలి చిత్రం షూటింగ్ పై ఏ విధమైన ప్రబావం చూపించలేదన్నారు. ఓ ప్రక్కన రైడింగ్ జరుగుతున్నా మరో ప్రక్కన షూటింగ్ శుక్రవారం షూటింగ్ జరుగుతూనే ఉంది. అందుకు కారణం ఈ రోజున ప్రతీ చిత్రం షూటింగ్ ..కు సంభందించిన ట్రాన్సిక్షన్స్ మొత్తం చెక్ ల ద్వారానే అఫీషియల్ గా జరగటమే అని చెప్పారు. నేను కూడా బాహుబలి, బాహుబలి సీక్వెల్ కు సంభందించిన ఫైనాన్సియల్ వ్యవహారాలు మొత్తం చెప్పగలను. అంత పారదర్శకత ఉంది అన్నారు. షూటింగ్ లో ఎక్కడా క్యాష్ పేమెంట్ అనేది జరగటం లేదని తెలియచేసారు.

    Baahubali 2 not affected by IT raid : Vijayendra Prasad,

    అంతేకాకుండా ఈ నోట్ల రద్దు వ్యవహారం నిజానికి ప్రాక్టికల్ గా కన్నా సైక్లాజికల్ గా ఎక్కువ ఇంపాక్ట్ చూపించదని అన్నారు. దేశంలో ఉన్న జనం పాత పెద్ద నోట్ల రద్దు అనౌన్సమెంట్ రాగానే పానిక్ కు గురి అయ్యారన్నారు. అయితే జాతీ మనగడ కోసం, కాస్త అసౌకార్యాన్ని భరించాల్సిందే అన్నారు.

    బాహుబలి షెడ్యూలు గురించి చెప్తూ... మేము డిసెంబర్ కల్లా బాహుబలి సీక్వెల్ షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ బిగిన్ చేస్తాం. ఇక ఎక్సపెక్టేషన్స్ కు మేమేమీ కంగారుపడటం లేదు. ఎందుకంటే బాహుబలి సీక్వెల్ అనేది ఇప్పటి ఆలోచన కాదు. బాహుబలి షూటింగ్ కు ముందు ఆలోచన. అంతేతప్ప బాహుబలి హిట్టయ్యాక సీక్వెల్ ప్లాన్ చేయలేదు. మొదటి సినిమాతో పాటే రెండో పార్ట్ కు సంభందించిన స్క్రిప్టు కూడా పూర్తి చేసాం అన్నారు.

    అలాగే తాను అప్పడప్పుడూ షూటింగ్ లొకేషన్ కు వెళ్తానని చెప్తూ... ఏమమ్మా చిన్న చిన్న మార్పులు అవసరమైనప్పుడు షూటింగ్ లొకేషన్ కు వెల్తూంటాను. బాహుబలి అనేది టీమ్ అందరి సమిష్టి కృషి. అలాగే హీరో ప్రభాస్ కు బాహుబలి తర్వాత ఎన్ని ఆకర్షణీయమైన ఆఫర్స్ వచ్చినా కూడా ..మూడేళ్లు ఈ సినిమాకే కమిటయ్యి..ఏ సినిమా ఒప్పుకోకుండా పనిచేసారు అంటూ మెచ్చుకున్నారు ఆయన.

    English summary
    Income tax officials swooped down on the Arka media office in Hyderabad and on Baahubali producers, Shobu Yarlagadda and Prasad Devineni on Friday. However, screenwriter K.V. Vijayendra Prasad, who scripted Baahubali: The Conclusion, says that the raid on the film’s producers did not affect the shooting schedule.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X