Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
7వేల స్కీన్లతో చైనా బాక్సాఫీసుపై ‘బాహుబలి-2’ దండయాత్ర, టార్గెట్ రూ. 2500 కోట్లు...
Recommended Video
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి-ది కంక్లూజన్' ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ముఖ్యమైన సినిమాగా నిలిచిపోయింది. ఫిల్మ్ మేకింగ్‌లో సరికొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేయడమే కాకుండా... భారతీయ సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని రికార్డులను బద్దలు కొడుతూ ఇటు దేశీయ బాక్సాఫీసు వద్ద, అటు ఓవర్సీస్ బక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు నమోదు చేసింది.
7000లకుపైగా స్క్రీన్లలో చైనా రిలీజ్
ఈ సెన్సేషనల్ చిత్రం ఇప్పటి వరకు ఇండియాతో పాటు చాలా దేశాల్లో విడుదలైంది కానీ... చైనాలో విడుదల కాలేదు. ఎట్టకేలకు మే 4న చైనాలో విడుదల చేస్తున్నారు. ఈ మూవీపై చైనాలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా ఎగ్జిబిటర్లు దీన్ని ఆ దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విడుదల చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 7000 పైగా స్క్రీన్లలో ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేస్తున్నారట. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ఓ ట్వీట్ చేశారు.
చైనాలో భారీగా విడుదలైన చిత్రాలు
7000 ప్లస్ స్క్రీన్లలో విడుదల కావడం ద్వారా రిలీజ్ విషయంలో ‘దంగల్' రికార్డును బాహుబలి-2 బీట్ చేసినట్లయింది. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ మూవీ ‘బజరంగీ భాయిజాన్' చైనాలో 8000పైగా స్క్రీన్లలో విడుదలైంది. ఈ సినిమా తర్వాత చైనాలో అత్యధిక స్క్రీన్లలో విడుదలవుతున్న చిత్రం ‘బాహుబలి-2' మాత్రమే.
టార్గెట్ రూ. 2500 కోట్లు
కలెక్షన్స్ విషయంలో ఇప్పటి వరకు ‘దంగల్' మూవీ టాప్ పొజిషన్లో ఉంది. ఈ చిత్రం రూ. 2,122 కోట్లు వసూలు చేయగా.... ఇందులో దాదాపు రూ. 1300 కోట్ల కేవలం చైనాలోనే వసూలయ్యాయి. బాహుబలి-2 మూవీ చైనాలో విడుదల కాకుండానే రూ. 1,715 వసూలైంది. చైనా విడుదల తర్వాత బాహుబలి 2 టోటల్ కలెక్షన్ రూ. 2500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.
జపాన్‌లో 100 రోజుల పండగ
బాహుబలి మూవీ ఇటీవల జపాన్‌లో విడుదలకాగా 100 రోజులు పూర్తి చేసుకుని అక్కడ భారీ వసూళ్లు సాధించింది. జపాన్‌లో జరిగిన 100 రోజుల వేడుకకు రాజమౌళి కూడా హాజరైన సంగతి తెలిసిందే.