»   » బాహుబలి-2 : ప్రభాస్ డైట్, జిమ్ వర్కౌట్స్ వివరాలు

బాహుబలి-2 : ప్రభాస్ డైట్, జిమ్ వర్కౌట్స్ వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-2 షూటింగ్‌ డిసెంబర్లో మొదలై శరవేగంగా సాగుతోంది. ఇటీవలే కేరళలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో యూ ఎస్ షెడ్యూల్‌కు వెళ్ళనున్న రాజమౌళి అండ్ టీం ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది చివరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

బాహుబలి సినిమా కోసం ప్రభాస్ భారీగా బరువు పెరిగి కండలు తిరిగిన బాడీతో కనిపించారు. ఇందుకోసం ప్రభాస్ నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నారు. ప్రత్యేకమైన డైట్ తీసుకున్నారు. సినిమాలో పాత్రకు తగిన విధంగా పర్ ఫెక్టు షేపులో కనిపించడానికి చాలా కష్టపడ్డాడు. బాహుబలి మొదటి పార్టులో శివుడు పాత్రలో 130 కేజీల ఫిజిక్ తో బలిష్టంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే సినిమా షూటింగ్ తర్వాత ప్రభాస్ మళ్లీ కాస్త నార్మల్ గా అయ్యాడు.


మళ్లీ ఇపుడు బాహుబలి-2 కోసం కొన్ని రోజుల ముందు నుండే ప్రభాస్ వర్కౌట్స్ మొదలు పెట్టాడు. ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్, డైటీషియన్స్ పర్యవేక్షణలో వర్కౌట్స్ చేస్తూ, ప్రత్యేకమైన డైట్ తీసుకుంటున్నారు. బాహుబలి-2 కోసం ప్రభాస్ ఎలాంటి వర్కౌట్స్ చేస్తున్నారు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాడనే విషయాలు బయటకు వచ్చాయి.


ప్రభాస్ రోజు రెండు సెషన్స్ లో వర్కౌట్స్ చేస్తున్నాడు. ఉదయం గంటన్నర, సాయంత్ర గంటన్నర పాటు వ్యాయామానికి కేటాయిస్తున్నాడు. ఇందుకోసం ప్రభాస్ ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసారు. జిమ్ ఎక్విప్ మెంట్స్ ప్రత్యేకంగా అమెరికా నుండి తెప్పించారు. బేసిక్ వార్మ్ అప్స్ పూర్తయిన తరువాత.... 15 నిమిషాల పాటు కార్డియోవాస్కులర్ ఎక్సర్ సైజ్, 15 నిమిషాల పాటు యోగా, డంబెల్, స్ట్రెచ్చెస్ తదితర వ్యాయామాలు చేస్తున్నాడు. క్రాస్ ఫిట్, పాలీమెట్రిక్స్ ప్రభాస్ డైలీ కార్డియో ట్రైనింగులో భాగంగా ఉన్నాయి.


డైట్ విషయానికొస్తే....నిపుణులు సూచించిన ఆహారాన్ని ప్రభాస్ ఇంట్లోనే తయారు చేయిస్తున్నారు. ప్రభాస్ బాడీ వెయిట్, కండీషన్, అతని లైఫ్ స్టైల్ కి తగిన విధంగా డైట్ డిజైన్ చేసారు.


వెజ్-నాన్ వెజ్

వెజ్-నాన్ వెజ్

వెజ్, నాన్ వెజ్ రెండూ బ్యాలెన్స్ గా తీసుకుంటున్నాడు. ప్రోటీన్లు, కార్పోహైడ్రేట్లు ప్రభాస్ బాడీకి ఎంత అవసరమో అంత అందేలా ఫుడ్ అందిస్తున్నారు.


బ్రేక్ ఫాస్ట్

బ్రేక్ ఫాస్ట్

ప్రతిరోజూ ఉదయం 42 ఎగ్ వైట్స్, 250 గ్రాముల చికెన్, తాజా పళ్లు తీసుకుంటున్నాడు.


మీల్స్

మీల్స్

మీల్స్ ఒకేసారి తీసుకోకుండా 7 సార్లు కొద్ది కొద్దిగా తీసుకునేలా ప్లాన్ చేసారు. ఇందులో బ్రౌన్ రైస్, ఓట్ మీల్, వెజ్ సలాడ్, బ్రాకోలి, స్పినాచ్, పాస్తా మొదలైనవి తప్పకుండా ఉండేలా డైట్ ప్లాన్ చేసారు.


ప్రోటీన్ ఫౌడర్

ప్రోటీన్ ఫౌడర్

ఉదయం, సాయంత్రం వర్కౌట్స్ తర్వాత రెడీమేడ్ ప్రోటీన్ ఫౌడర్ ఒకటిన్నర స్పూన్స్ చొప్పున తీసుకుంటున్నాడు. పడుకునే ముందు సూప్ లేదా పాలు తీసుకుంటున్నాడు.


English summary
Prabhas is building and maintaining that well toned physique, here's his fitness regime and the diet chart for Baahubali 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu