»   » ‘బాహుబలి -2’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

‘బాహుబలి -2’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' చిత్రం భారీగా రూ. 250 కోట్ల బడ్జెట్‌తో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1 ‘బాహుబలి ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం యావత్ ఇండియన్ సినీ ప్రేక్షకలోకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

రాజమౌళి చెప్పిన వివరాల ప్రకారం ‘బాహుబలి 2' షూటింగ్ కూడా దాదాపుగా సగం పూర్తయింది. ప్రస్తుతం ‘బాహుబలి' టీం మొత్తం ప్రస్తుతం పార్ట్ -1 విడుదలపైనే దృష్టి సారించారు. నటీనటులంతా ప్రచార కార్యక్రమాల్లో అంతా బిజీ అయ్యారు. ప్రత్యేకంగా మరో టీం ప్రపంచ వ్యాప్తంగా సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసే ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. రాజమౌళి నేతృత్వంలోనే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.‘బాహుబలి' పార్ట్ 1 సక్సెస్ అయితేనే..... పార్ట్ 2పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అందుకే ఫస్ట్ పార్ట్ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కథ విషయంలోనూ సస్పెన్స్ రేకెత్తించే విధంగా తెరకెక్కించారు. సెకండ్ పార్టులో ఏం జరుగుతుందో చూడాలని ప్రక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తేలా కొన్ని ట్విస్టులు ఉంటాయని సమాచారం.


సరిగ్గా వచ్చే ఏడాది జులై నెలలోనే బాహుబలి పార్ట్ 2ను విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. పార్ట్-1కు ధీటుగా పార్ట్-2 ఉంటుందని అంటున్నారు. భారతీయ సినీ చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ సినిమా ఉండబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary
As of now, most of the shoot of 'Baahubali 2' has been wrapped up. The makers are planning to release this movie exactly after one year of the release of 'Baahubali- The Beginning'. As such, the second part is slated for release sometime in the month of July, 2016.
Please Wait while comments are loading...