Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘బాహుబలి-2’ రిలీజ్ డేట్ మారింది, అఫీషియల్ ప్రకటన (ఫోటోస్)
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం తెలసుకోవడానికైనా చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి-2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెలిపారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలీవుడ్‌లో 'బాహుబలి'ని విడుదల చేసిన కరణ్... రెండో పార్ట్ బాహుబలి ది కన్ క్లూజన్ హిందీ వర్షెన్ ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టు ప్రకటించారు. బాహుబలి అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇం
బాహుబలి పార్ట్-1 భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మళయాలంతో పాటు హిందీలో కూడా రిలీజైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ. 650 కోట్లు వసూలు చేసింది. ఇంతర భారీ మొత్తం వసూళ్లు ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకే సాధ్యం అనే ఒక వాదన ఉండేది. సౌత్ సినిమాలకు కూడా ఆ సత్తా ఉందని బాహుబలి సినిమా నిరూపించింది.
బాహుబలి పార్ట్ 1 విడుదల సందర్భంగా తెలుగునాట థియేటర్ల వద్ద జాతర వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల టికెట్ల కోసం గొడవలు జరిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి అలాంటి ఇబ్బందులు, బ్లాక్ మార్కెటింగ్ లాంటివి జరుగకుండా పకడ్భంధీ ఏర్పాట్లు చేయనున్నారు.
స్లైడ్ షోలో బాహుబలికి సంబంధించిన రేర్ ఫోటోస్...

బాహుబలి-2 రిలీజ్ డేట్
బాహుబలి-2 రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అఫీషియల్ పేజీలో ఈ ఫోటో పోస్టు చేసారు.

పార్ట్-2
బాహుబలి పార్ట్ 1లో కేవలం పాత్రల ఇంట్రడక్షన్ మాత్రమే జరిగింది. అసలు స్టోరీ అంతా పార్ట్ 2లోనే ఉండబోతోంది.

ప్లానేంటో?
బాహుబలి బిగినింగ్ లో యుద్ధ సన్నివేశాలు హైలెట్ అయ్యాయి. మరి పార్ట్ 2లో రాజమౌళి ఎలా ప్లాన్ చేసాడో?

అనుష్క
తొలి భాగంలో ప్రభాస్, తమన్నాల రొమాన్స్ హైలెట్ అయింది. పార్ట్ 2లో ప్రభాస్, అనుష్కల రొమాన్స్ హైలెట్ కాబోతోంది.

సీన్స్
పార్ట్ 2లో పోరాట సన్నివేశాలు మరింత ఉత్కంఠ భరితంగా ఉండబోతున్నాయి.

తమన్నా, ప్రభాస్
బాహుబలి పార్ట్ 1కు సంబంధించిన ఫోటో ఇది. సెట్స్ లో తమన్నా, ప్రభాస్, నిర్మాత శోభు.

రేర్ ఫోటో
బాహుబలి సెట్స్ లో రానా, ప్రభాస్, రాజమౌళి, శేషు.

అనుష్క, నాజర్, శేషు
బాహుబలి సెట్స్ లో అనుష్క, నాజర్, శేషు తదితరులు...

జలపాతం సీన్
బాహుబలి మూవీలో జలపాతం సీన్ తీసినప్పటి ఫోటో ఇది.

అనుష్క
బాహుబలి-2లో అనుష్క యంగ్ లుక్ లో కనిపించబోతోంది.

రమ్య క్రిష్ణ
బాహుబలి-2లో కూడా రమ్యక్రిష్ఠ పాత్ర కీలకంగా ఉండబోతోంది.

యుద్ధ సన్నివేశాలు
బాహుబలి 2లో యుద్ద సన్నివేశాలు తొలి భాగాన్ని మించేలా ఉండబోతున్నాయి.

రానా, ప్రభాస్
రానా, ప్రభాస్ మధ్య బాహుబలి-2లొ హోరా హోరీ గా సాగే సన్నివేశాలు ఉండబోతున్నాయి.

సెట్స్
బాహుబలి మూవీ సెట్స్ లో రానా, ప్రభాస్.

లుక్ సూపర్బ్
బాహుబలి-2లొ ప్రభాస్ లుక్ మరింత సూపర్బ్ గా ఉండబోతోంది.

ఫైట్ సీన్లు
రానా, ప్రభాస్ మధ్య బాహుబలి -2లో డైరెక్టర్ ఫైట్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది.

ట్రైనింగ్
బాహుబలి-2 కోసం ప్రభాస్ కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు.

అనుష్క
బాహుబలి-2లో అనుష్క తన గ్లామర్, పోరాట సన్నివేశాలతో ఆకట్టుకోబోతోంది.

సాంగ్స్
బాహుబలి 2లో కూడా పచ్చబొట్టేసిన తరహాలో రొమాంటిక్ సాంగ్స్ ఉండబోతున్నాయి.

హైలెట్
బాహుబలి పార్ట్ 1లో పచ్చబొట్టేసిన సాంగ్ బాగా హైలెట్ అయింది.

సెట్స్
బాహుబలి సెట్స్ లో రాజమౌళి, ప్రభాస్..

షూటింగు గ్యాపులో
షూటింగు గ్యాపులో రానా, ప్రభాస్, నిర్మాత శోభు యర్లగడ్డ కూల్ గా...

రాజమౌళి మాస్టర్ మైండ్
బాహుబలి సినిమా వెనక మాస్టర్ మైండ్ రాజమౌళి. ఆయన లేకుంటే తెలుగులో ఇంత పెద్ద సినిమా ఉండేదే కాదు.

రానా
బాహుబలి సినిమా కోసం రానా భారీగా కండలు పెంచాల్సి వచ్చింది.