»   »  ‘బాహుబలి-2’ రూ. 325 కోట్లకు అమ్ముడు పోయిందంట!

‘బాహుబలి-2’ రూ. 325 కోట్లకు అమ్ముడు పోయిందంట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ‘బాహుబలి-ది బిగినింగ్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల రికార్డు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వసూళ్లు కేవలం 5 రోజుల్లోనే రూ. 200 కోట్లను అధిగమించింది.

Baahubali 2 Sold Out For 325 Cr

‘బాహుబలి' చేస్తున్న బిజినెస్ చూసి పలు కార్పొరెట్ సినీ నిర్మాణ సంస్థలు సెకండ్ పార్టునుదక్కించుకోవడానికి పోటీపడ్డాయి. ‘బాహుబలి' పార్ట్ 2 హక్కులను రూ. 325 కోట్లుకు ఓ కార్పొరేట్ సినీ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసినట్లు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.బాహుబలి' చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు రాబడుతోంది. ఇప్పటి వరకు అమెరికాలో దాదాపు 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం ఈ వారం యూఎస్ఏ టాప్-10 హయ్యెస్ట్ గ్రాసింగ్ లిస్టులో చోటు దక్కించుకుంది.
న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు ప్రకారం... బాహుబలి అక్కడ ఈ వారం 9వ స్థానంలో ఉంది. జూరాసిక్ వరల్డ్, టెర్మినేటర్, ఇన్ సైడ్ ఔట్ లాంటి సినిమాలతో పోటీ పడుతూ టాప్ 10 లిస్టులో చోటు దక్కించుకుంది. వీకెండ్ తో పాటు సోమవారం కూడా ‘బాహుబలి' కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఇప్పటికే 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ‘బాహుబలి' త్వరలోనే 6 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన బాహుబలి రెండు భాగాలు కలిపి రూ. 250 కోట్లతో తెరకెక్కుతోంది. ప్రస్తుతం విడుదలైన తొలి భాగా ‘బాహుబలి-ది బిగినింగ్' అంచనాలకు మించిన వసూళ్లు సాధిస్తోంది. రెండో భాగం 2016లో విడుదల కాబోతోంది.


English summary
Late in the night, director Ram Gopal Varma has stunned everyone by tweeting that the Part II of Rajamouli's superior creation got sold out. He stated that Baahubali-2 was sold for 325 crores to a leading corporate giant.
Please Wait while comments are loading...