»   » బాహుబలి-2 తో ఆగదు, వర్చువల్ రియాల్టీలో కూడా: ప్రెస్ మీట్లో రాజమౌళి, ప్రభాస్, రానా (ఫోటోస్)

బాహుబలి-2 తో ఆగదు, వర్చువల్ రియాల్టీలో కూడా: ప్రెస్ మీట్లో రాజమౌళి, ప్రభాస్, రానా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: బాహుబలి పార్ట్-1 భారీ విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా వస్తున్న 'బాహుబలి-ది కంక్లూజన్' సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా విడుదలకు మరో ఆరు నెలల సమయం ఉంది. కానీ అక్టోబర్ నుంటే అంటే రేపటి నుండే సినిమా ప్రమోషన్లు మొదలు కాబోతున్నాయి.

  శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో బాహుబలి-2 టీం ప్రెస్ మీట్ పెట్టారు. దర్శకుడు రాజమౌళితో పాటు ప్రభాస్, రానా, నిర్మాతలు శోభు, ప్రసాద్ పాల్గొన్ని పలు ఆస్తికర విషయాలు వివరించారు. ఈ సందర్భంగా బాహుబలి-ది కంక్లూజన్ లోగో ఆవిష్కరించారు.

  నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.... ముఖ్యమైన సీన్స్ అన్ని షూటింగ్ పూర్తయింది. డిసెంబర్ నాటికి పాటలతో పాటు మొత్తం చిత్రీకరణ అంతా పూర్తి చేసేస్తాం. ఏప్రిల్‌ 28న బాహుబలి 2 విడుదల చేస్తాం. జనవరిలో ట్రైలర్ వస్తుందన్నారు.

  రాజ‌మౌళి మాట్లాడుతూ బాహుబ‌లి టీమ్‌కి అక్టోబ‌ర్ ఎగ్జ‌యిట్‌మెంట్ మంత్‌. సినిమాకు సంబంధించిన ర‌క‌ర‌కాల విష‌యాలు అక్టోబ‌ర్‌లోనే విడుద‌ల‌వుతాయి. బాహుబ‌లి సీరీస్ యామెజాన్ ప్రైమ్‌లో రానుంది. దానికి సంబంధించిన టీజ‌ర్ అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌వుతుందని తెలిపారు.

  అక్టోబర్ 5న గుడ్ న్యూస్, ప్రభాస్ పెళ్లి గుచించి కాదు...

  అక్టోబర్ 5న గుడ్ న్యూస్, ప్రభాస్ పెళ్లి గుచించి కాదు...

  అక్టోబ‌ర్ 5న ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్తున్నాం. గుడ్ న్యూస్ అన‌గానే పెళ్లి గురించి అనుకోకండి. ఈ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు పెళ్లి చేసుకోడు. అంటే నేను చేసుకోవ‌ద్ద‌ని చెప్పాన‌ని కాదు. త‌నే ఆ మాట చెప్పాడు. అలాగ‌ని త‌న త‌దుప‌రి సినిమా న్యూస్ కూడా కాదు. త‌న అభిమానుల‌కే కాదు మొత్తం సౌత్ ఇండియాకే ప్రౌడ్ న్యూస్‌. అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుందని రాజమౌళి తెలిపారు.

  కేవలం బాహుబలి సినిమానే కాదు...

  కేవలం బాహుబలి సినిమానే కాదు...

  బాహుబలి ప్రాజెక్టును కేవలం సినిమాకే పరిమితం చేయాలనుకోవడం లేదు. బాహుబ‌లిని ఒక మ‌హావృక్షంగా తీసుకుంటే టీవీ సీరీస్‌, కామిక్స్, బుక్స్, గేమ్స్ అన్నీ హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్‌తో తీస్తున్నామని రాజమౌళి తెలిపారు.

  బాహుబ‌ల్ వ‌ర్చువ‌ల్ రియాలిటీ

  బాహుబ‌ల్ వ‌ర్చువ‌ల్ రియాలిటీ

  బాహుబ‌ల్ వ‌ర్చువ‌ల్ రియాలిటీ ఎక్స్పీరియ‌న్స్ అనేది అంద‌రూ ఎక్స‌యిట్ అయ్యేది. ఇది ప్ర‌పంచంలో అంద‌రూ ఇప్పుడిప్పుడు ఎక్స్పీరియ‌న్ప్ చేస్తున్న విష‌యం. మేం ఈ సినిమాతో చేయ‌డానికి ట్రై చేస్తున్నాం. మాహిష్మ‌తి సామ్రాజ్యాన్ని 360 డిగ్రీస్‌లో ఎక్స్ పీరియ‌న్స్ చేయ‌గ‌లిగితే అది వ‌ర్చువ‌ల్ రియాలిటీ. టుడీ తెర‌మీద బొమ్మ చూస్తున్న‌ట్టు కాకుండా మాహిష్మ‌తి ప్ర‌పంచంలోకి వెళ్లి అక్క‌డ జ‌ర‌గుతున్న క‌థ‌ని అక్క‌డివారితో క‌లిసి చూస్తున్న‌వారిగా అనుభూతిని క‌లిగించ‌డ‌మే మా ప్ర‌య‌త్నం.... అందులో భాగంగానే దీన్ని చేస్తున్నామని రాజమౌళి తెలిపారు.

  ప్ర‌పంచంలో తొలిసారి బాహుబ‌లి విషయంలోనే

  ప్ర‌పంచంలో తొలిసారి బాహుబ‌లి విషయంలోనే

  360 ఫోటోస్ అనో, వీడియోస్ అనో ఫోన్‌లో చూసుకుంటే కెమెరా తిప్పుతుంటే 360 డిగ్రీస్‌లో అన్నీ క‌నిపిస్తాయి. దానిక‌న్నా కాస్త ఎహెడ్‌గా వెళ్తే గూగుల్ కార్డ్ బోర్డ్ లో ఫోన్ పెట్టుకుని చూసినా క‌నిపిస్తుంది. శామ్‌సంగ్ గేర్‌వియ‌ర్‌ని పెట్టుకుని చూస్తే వ‌ర్చువ‌ల్ ప్ర‌పంచాన్ని చూడొచ్చు. ఏ ఫోన్ ఉంటే ఆ స్మార్ట్ ఫోన్‌లో దాన్ని చూడొచ్చు. రూ.100 నుంచి రూ.3000 వ‌ర‌కు కాస్ట్ ప‌డొచ్చు. దీనిక‌న్నా హ‌య్యండ్ వ‌ర్చువ‌ల్ రియాలిటీ ని రూ.2ల‌క్ష‌ల ఖ‌ర్చుతో ఆక్యుల‌స్ రిఫ్ట్ గానీ, వైవ్‌గానీ హ‌య్య‌స్ట్ గ్లాస‌స్ దొరుకుతాయి. మేం చేసే బాహుబ‌లి ఎక్స్ పీరియ‌న్స్ ఆ గ్లాసెస్ కోసం చేస్తున్నాం. క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌య‌బుల్ లేదు కాబ‌ట్టి 200, 300 థియేట‌ర్ల‌లో వాటిని స్టాల్స్ పెట్టి మేం ఇస్తాం. ఎక్స్ పీరియ‌న్స్ చేయొచ్చు. ప్ర‌పంచం మొత్తం మీద ఇలాంటిది తొలిసారి బాహుబ‌లి సినిమాల‌కే జ‌రుగుతుంది. రూ.25కోట్ల బ‌డ్జెట్‌లో అది అనుభ‌వంలోకి వ‌స్తుందిని రాజమౌళి తెలిపారు.

  బాహుబలి రిలీజ్ ముందు అది రిలీజ్ చేస్తాం

  బాహుబలి రిలీజ్ ముందు అది రిలీజ్ చేస్తాం

  బాహుబ‌లి థియేట‌ర్ల‌లో విడుద‌ల కావ‌డానికి నెల రోజుల ముందుగానే వ‌ర్చువ‌ల్ రియాలిటీ హ‌య్యండ్‌ ఎక్స్ పీరియ‌న్స్ ను విడుద‌ల చేస్తాం. దాంతో పాటు మేకింగ్ వీడియోస్‌ని వ‌ర్చువ‌ల్ రియాలిటీలో చేస్తున్నాం. మేకింగ్ వీడియోల‌ను కూడా హ‌య్యండ్ క్వాలిటీస్‌తో చేస్తున్నామని తెలిపారు.

  ప్ర‌భాస్ పుట్టిన‌రోజుకి

  ప్ర‌భాస్ పుట్టిన‌రోజుకి

  ఫ‌స్ట్ మేకింగ్ విఆర్ వీడియోస్‌ని ప్ర‌భాస్ పుట్టిన‌రోజుకి విడుద‌ల చేయ‌నున్నాం. ఈ రోజు మ‌ధ్యాహ్నం నేను తొలి టెస్ట్ చూశా. యూఎస్‌కి వెళ్లి వ‌ర్చువ‌ల్ రియాలిటీ టెక్నాల‌జీని గురించి తెలుసుకున్నా. ర‌క‌ర‌కాల కంపెనీల్లో వీడియోలు చూశా. నేను అక్క‌డ చూసిన క్వాలిటీ క‌న్నా, మేం తీసిన టెస్ట్ షార్ట్ చాలా మంచి క్వాలిటీతో ఉంది. అది చెప్ప‌డానికి గ‌ర్విస్తున్నామని రాజమౌళి తెలిపారు.

  బాహుబలి మహావృక్షం, అందులో ఒక కొమ్మ మాత్రమే సినిమా

  బాహుబలి మహావృక్షం, అందులో ఒక కొమ్మ మాత్రమే సినిమా

  రానా మాట్లాడుతూ ``. నేను రాజ‌మౌళిగారిని క‌లిసిన‌ప్పుడు ఒక మ్యాప్ చూపించారు. మ‌హిష్మ‌తి అనే రాజ్యం. ది వాళ్లు క్రియేట్ చేసిన ప్ర‌పంచం. ఒక మ‌హావృక్షాన్ని వాళ్లు క్రియేట్ చేశారు. అందులో ఒక కొమ్మ సినిమా. టెలివిజ‌న్ సీరీస్‌, కామిక్ బుక్స్, మెర్చండైజింగ్‌, వ‌ర్చువ‌ల్ థింగ్స్ వంటి విష‌యాల్లో వాళ్లు కేర్ తీసుకున్నారు. యామ‌జాన్ ప్రైమ్ నుంచి మా టీజ‌ర్‌ను అక్టోబ‌ర్ 1న విడుద‌ల చేయ‌నున్నాం. వ‌ర‌ల్డ్ క్లాస్ యానిమేష‌న్ చూస్తున్న‌ట్టు అనిపిస్తుంది`` అన్నారు.

  నా పుట్టినరోజున వస్తోంది

  నా పుట్టినరోజున వస్తోంది

  ప్ర‌భాస్ మాట్లాడుతూ ``బాహుబ‌లి కామిక్ బుక్స్ విడుద‌ల చేస్తున్నాం. అక్టోబ‌ర్ 22న విడుద‌ల చేస్తాం. నా ఫ్యాన్స్, అంద‌రూ ఎదురుచూస్తున్న ఫ‌స్ట్ లుక్‌ను అక్టోబ‌ర్ 22న నా పుట్టిన‌రోజుకు ఒక రోజు ముందు ఫ‌స్ట్ లుక్‌ను కూడా విడుద‌ల చేస్తున్నాం`` అని చెప్పారు.

  బాహుబలి సినిమా స్టోరీ చెప్పడం కుదరదు

  బాహుబలి సినిమా స్టోరీ చెప్పడం కుదరదు

  బాహుబలి-2కు సంబంధించిన విషయాలను చెప్పాలని మీడియా వారు అడగ్గా... నా గత చిత్రాలకు ముందే స్టోరీ చెప్తూ వచ్చాను. కానీ బాహుబ‌లికి సంబంధించి ఎలాంటి విష‌యాల‌ను రివీల్ చేయ‌లేదు. బాహుబ‌లి సినిమా తాలూకు విష‌యాల‌ను రివీల్ చేయ‌కూడ‌దు. క‌థ‌కు సంబంధించి సినిమాలోనే చూడ‌టం క‌రెక్ట్ అని నా ఫీలింగ్‌ అని రాజమౌళి స్పష్టం చేసారు.

  మరిన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ..

  మరిన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ..

  సెకండాఫ్‌లో త‌మ‌న్నా ఉంటుంది. కానీ ఆమె మీద పాట‌లు లేవు. అనుష్క ఇందులో హీరోయిన్‌. క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్స్ విష‌యంలో, మ‌నుషుల విష‌యంలో ఏ ఇబ్బందులు లేకుండా పూర్తి చేయ‌గ‌లిగాం. రెండున్నర నెల‌లు స‌మ‌యం ప‌ట్టింది. ఎడిటింగ్ చేసి గ్రాఫిక్స్ చేశాం. రెండు పాట‌లు, చిన్న ప్యాచ్ వ‌ర్క్, ఒక చిన్న యాక్ష‌న్ సీక్వెన్స్ చేయాల్సి ఉందని రాజమౌళి తెలిపారు.

  బాహుబలి 3 కూడా ఉంది

  బాహుబలి 3 కూడా ఉంది

  బాహుబ‌లి అనే మ‌హావృక్షం నుంచి చాలా సినిమా అనేది కొమ్మ మాత్ర‌మే. బాహుబ‌లి పార్ట్ 3 అనేది ఆన్ ద కార్డ్స్ అని రాజమౌళి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

  నేషనల్ ఆడియన్సే మా టార్గెట్

  నేషనల్ ఆడియన్సే మా టార్గెట్

  ఓ ప్రశ్నకి రాజమౌళి సమాధానం ఇస్తూ... నేష‌న‌ల్ ఆడియ‌న్స్ నే నేను టార్గెట్ చేశాను. దీనికి సంబంధించి మేం ఎ.ఎం.డి వాళ్ల‌తో కొలాబ‌రేట్ అయ్యాం. వాళ్లు నాణ్య‌త‌తో కూడిన వాటిని అందిస్తారు. కెమెరాలు, రిలేటెడ్ టెక్నాల‌జీ, దానికి సంబంధించిన స్టిచింగ్‌, హై క్వాలిటీ 360 డిగ్రీ ఇమేజ్‌ని తీసుకురావ‌డానికి వాళ్లు హెల్ప్ చేస్తున్నారని రాజమౌళి తెలిపారు.

  లాస్ ఏంజిల్స్ లో గ్రాఫిక్స్ వర్క్

  లాస్ ఏంజిల్స్ లో గ్రాఫిక్స్ వర్క్

  లాస్ ఏంజెల్స్ కి సంబంధించిన గ్రాఫిక్స్ కంపెనీల్లో సీజీ వ‌ర్క్ జ‌రుగుతోంది. వ‌ర్చువ‌ల్ రియాలిటీకి సంబంధించింది ముఖ్యంగా అక్క‌డ జ‌రుగుతోంది. సీఎన్‌సీపీటీ అనే కంపెనీ లాబీ పాట్స్ ను ఇస్తోంది. వీఆర్ ఎక్స్ పీరియ‌న్స్ అనేది జాన్ రిఫెల్ కి చెందిన కంపెనీ అది. వ‌ర్చువ‌ల్ రియాలిటీకి సంబంధించిన పార్ట్స్ కోసం వేరే కంపెనీలతో క‌లిసి చేస్తున్నామని రాజమౌళి తెలిపారు.

  తమన్నా పక్కనే ఉన్న అనుభూతి ప్రేక్షకులు పొందవచ్చు

  తమన్నా పక్కనే ఉన్న అనుభూతి ప్రేక్షకులు పొందవచ్చు

  మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ... తమన్నా ఫ్యాన్స్ తమన్నాతో కలిసి పాట పాడుతున్నట్లు వర్చువల్ ఎక్స్ పీరియన్స్ కల్పించడం సాధ్యమే అన్నారు రాజమౌళి.

  బాహుబలిని వదలాలని లేదు

  బాహుబలిని వదలాలని లేదు

  మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ......నాకు బాహుబ‌లిని వ‌ద‌లాల‌ని లేదు. వెస్ట్ లో ఆల్ ద ఫ్రాంచైసిస్ అనేది ఎవ‌రైతే క్రియేట్ చేశారో వాళ్లు పోయిన త‌ర్వాత కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ సినిమా కోసం ఆర్టిస్టులు పెట్టిన హార్డ్ వ‌ర్క్ సినిమా అయ్యాక ఆగిపోవాల‌ని లేదు. కంటిన్యూ కావాల‌ని ఉందని రాజమౌళి తెలిపారు.

  బాహుబలి కంటిన్యూ అవుతుంది

  బాహుబలి కంటిన్యూ అవుతుంది

  బాహుబలి ఫ్రాంచైజీ అంటే... నేను బాహుబలి సినిమాలు మాత్రమే తీస్తూ పోతానని కాదు... బాహుబ‌లి అనేది దాని మానా,న అది కంటిన్యూ అవుతుంది. నేను దాంతో మాత్ర‌మే ఉండ‌ను ఇతర సినిమాలు కూడా చేస్తాను అన్నారు రాజమౌళి.

  ఆశ‌కి ఏముందండీ ఆస్కార్ కావాల‌ని కూడా ఉంటుంది

  ఆశ‌కి ఏముందండీ ఆస్కార్ కావాల‌ని కూడా ఉంటుంది

  సినిమాపై అంచనాలు 1000 కోట్లు అంటున్నారు... మీ అభిప్రాయం ఏమిటి? అనే దానికి రాజమౌళి స్పందిస్తూ.... ఒక సినిమా హిట్టయినపుడు అంచనాలు ఉండటం సహజం. అది తెలుగులో బాహుబ‌లి 1 ఎంత చేసిందో, దానికి 30-40 శాతం ఎక్కువ చేయాల‌ని ఎక్స్ పెక్టేష‌న్‌. హిందీ, మ‌ల‌యాళంలో టాప్ 10 సినిమాల్లో ఒక‌టి కావాల‌ని, త‌మిళ్‌లో టాప్ 5 సినిమాల్లో ఉండాల‌ని కోరుకుంటున్నాం. ఆశ‌కి ఏముందండీ ఆస్కార్ కావాల‌ని కూడా ఉంటుంది అంటూ రాజమౌళి ముగించారు.

  English summary
  Director SS Rajamouli unveiled Logo of “Baahubali 2 The Conclusion”.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more