»   » లాస్ట్ వర్కింగ్ డే: బాహుబలి-2 గురించి రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్

లాస్ట్ వర్కింగ్ డే: బాహుబలి-2 గురించి రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఏ సినిమాకు అయినా చివరి వరకు పని చేసేది దర్శకుడు మాత్రమే. సినిమా షూటింగ్ పూర్తయి, ప్రోస్టు ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయి, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సినిమా విడుదలకు సిద్ధమైనపుడే దర్శకుడికి విశ్రాంతి లభిస్తుంది.

బాహుబలి-2 సినిమాకు సంబంధించిన రాజమౌళికి ఈ రోజు.... లాస్ట్ వర్కింగ్ డే. ఈ సందర్భంగా రాజమౌళి ఈ రోజు ట్విట్టర్లో చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. 'లాస్ట్ వర్కింగ్ డే, అద్భుత జర్నీ .. మంచి అనుభ‌వం.. ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా పూర్తయినందుకు ఎంతో ఆనందంగా ఉంది.. కొద్దిగా బాధగా కూడా ఉంది'... అంటూ ఆయన ట్వీట్ చేసారు.


భారీ స్పందన

రాజమౌళి చేసిన ఈ ట్వీట్ కు అభిమానుల నుండి భారీ స్పందన వచ్చింది. వేలాది మంది లైక్స్, కామెంట్స్, రీ ట్వీట్లతో ఆయనకు బెస్టాఫ్ లక్ చెప్పారు. రాజమౌళి పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని, సినిమా భారీ విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షించారు.


ఐదేళ్ల అనంతరం లాస్ట్ వర్కింగ్ డే

ఐదేళ్ల అనంతరం లాస్ట్ వర్కింగ్ డే

రాజమౌళి ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్ల సమయాన్ని కేటాయించారు. ఈ ఐదేళ్లు ఆయన అలుపు లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. లార్జన్ దన్ లైఫ్ లాంటి సినిమాను ఇండియన్ ప్రేక్షకులకు అందించాలని కలలు కన్న ఆయన ఎట్టకేలకు తాను అనుకున్న పని పూర్తి చేసారు.


ఎన్నో కష్టాలకు ఓర్చి...

ఎన్నో కష్టాలకు ఓర్చి...

ఈ ఐదేళ్లు రాజమౌళి పడ్డ కష్టం గురించి మాటల్లో చెప్పడం కష్టమే. ఎవరూ పడనంత టెన్షన్, ఎవరికీ లేనన్ని బాధ్యతలు రాజమౌళి మోసారు. అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ‘బాహుబలి' అనే అద్భుతమైన సినిమాను ఆయన ఇండియన్ ప్రేక్షకులకు అందించారు. ః


బాహుబలి

బాహుబలి

బాహుబలి సినిమాకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి.


English summary
"Last working day......hope fully..🙂 What a journey..what an experience..I am both smiling with joy and wincing with pain." Rajamouli tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu