»   » క్లైమాక్స్ లే నాలుగంటే., ఇప్పుడు ట్రైలర్ లు కూడా రెండట : బాహుబ‌లి 2

క్లైమాక్స్ లే నాలుగంటే., ఇప్పుడు ట్రైలర్ లు కూడా రెండట : బాహుబ‌లి 2

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబ‌లి 2 హంగామా మొద‌లైపోయింది. త్వ‌ర‌లో ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం సన్నాహాలు చేస్తోంది. ప్ర‌భాస్ లుక్కుల్ని ఒకొక్క‌టిగా విడుద‌ల చేస్తున్న బాహుబ‌లి టీమ్... ఇప్పుడు థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల కోసం రంగం సిద్ధం చేస్తోంది. మార్చి 16న థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల కాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమయం రానే వచ్చేసింది.

హైద‌రాబాద్ లో సింపుల్‌గా ఓ ప్రెస్ మీట్ పెట్టి

హైద‌రాబాద్ లో సింపుల్‌గా ఓ ప్రెస్ మీట్ పెట్టి

హైద‌రాబాద్ లో సింపుల్‌గా ఓ ప్రెస్ మీట్ పెట్టి, ట్రైల‌ర్‌ని వ‌దిలేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. సాధార‌ణంగా పెద్ద సినిమా అంటే.. ముందు ఓ టీజ‌ర్ వ‌ద‌ల‌డం, ఆడియో ఫంక్ష‌న్‌లో ట్రైల‌ర్‌ని చూపించ‌డం జ‌రుగుతుంటుంది. అయితే.. బాహుబ‌లి విష‌యంలో మాత్రం అలాంటిదేం లేకుండా డైరెక్ట్ గానే రంగం లోకి దిగుతున్నారు.

థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్‌ని లాంచ్ చేయాల‌ని రాజ‌మౌళి ఫిక్స‌య్యారు

థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్‌ని లాంచ్ చేయాల‌ని రాజ‌మౌళి ఫిక్స‌య్యారు

అంటే టీజర్ లాంటిది ఏమీ లేదన్న మాట టీజ‌ర్ లేకుండానే నేరుగా థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్‌ని లాంచ్ చేయాల‌ని రాజ‌మౌళి ఫిక్స‌య్యారు. మార్చి 15న గానీ, 16న గానీ... ప్ర‌సాద్ ఐమాక్స్‌లో పాత్రికేయుల‌కు ట్రైల‌ర్ చూపించి.. అప్పుడు యూ ట్యూబ్‌లో ఉంచాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నార్ట‌.

ఒక్కో ట్రైల‌ర్ నిడివి దాదాపు రెండున్నర నిమిషాలు (140 సెక‌న్లు) ఉంద‌ట..

ఒక్కో ట్రైల‌ర్ నిడివి దాదాపు రెండున్నర నిమిషాలు (140 సెక‌న్లు) ఉంద‌ట..

ఇప్ప‌టికే యూనిట్ చాలా జాగ్రత్తగా రెండు ట్రైలర్లని కట్ చేసి ఉంచారు. ఇప్పుడు చూసుకుంటే రెండిటికీ రెండూ అద్బుతంగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు అందులో ఏది విడుద‌ల చేయాలా?? అంటూ తమలో తామే చర్చించుకుంటున్నారు. ఒక్కో ట్రైల‌ర్ నిడివి దాదాపు రెండున్నర నిమిషాలు (140 సెక‌న్లు) ఉంద‌ట..

రెండింటిలో ఏది రిలీజ్ చేయాలా అనేది ఇంకా తేల్చ‌లేద‌ని తెలుస్తోంది.

రెండింటిలో ఏది రిలీజ్ చేయాలా అనేది ఇంకా తేల్చ‌లేద‌ని తెలుస్తోంది.

రెండింటిలో ఏది రిలీజ్ చేయాలా అనేది ఇంకా తేల్చ‌లేద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు బాహుబ‌లి 2 కోసం నాలుగు క్లైమాక్స్‌లు తెర‌కెక్కించార‌న్న వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఆ మాట కూడా నిజ‌మే అని, ఈ నాలుగు క్లైమాక్స్ లూ చాలా బాగా వ‌చ్చాయ‌ని.. ఏది ఫిక్స్ చేయాల‌న్న విష‌యంలో రాజ‌మౌళి సైతం ఓ నిర్ణ‌యానికి రాలేక‌పోతున్నాడట.

బ‌హుశా ప్రింట్లు పంపించేముందు ఫైన‌ల్ వ‌ర్ష‌న్‌ని డిసైడ్ చేస్తార‌ని తెలుస్తోంది

బ‌హుశా ప్రింట్లు పంపించేముందు ఫైన‌ల్ వ‌ర్ష‌న్‌ని డిసైడ్ చేస్తార‌ని తెలుస్తోంది

బ‌హుశా ప్రింట్లు పంపించేముందు ఫైన‌ల్ వ‌ర్ష‌న్‌ని డిసైడ్ చేస్తార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు క్లైమాక్స్ విష‌యంలో రాజ‌మౌళి ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌ల అభిప్రాయాలు తెలుసుకొన్నాడ‌ని... ఎక్కువ మందికి న‌చ్చిన‌ క్లైమాక్స్‌నే రాజ‌మౌళి ఫైన‌ల్ చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

తెలుగుతో పాటు మిగిలిన భాష‌ల ట్రైల‌ర్ల‌ని ఏక కాలంలో విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది.

తెలుగుతో పాటు మిగిలిన భాష‌ల ట్రైల‌ర్ల‌ని ఏక కాలంలో విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది.

బాహుబలి పార్ట్ 1 ట్రైలర్ ని ముంబైలో ఘనంగా విడుదల చేశారు. ఈసారి పార్ట్ 2 ట్రైలర్ ని కూడా ముంబైలో లాంచ్ చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు బాహుబలి సమర్పకుడు కరణ్ జోహార్ ముంబైలో ఏర్పాట్లు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ట్రైల‌ర్ నిడివి దాదాపుగా రెండున్న‌ర నిమిషాలు ఉండొచ్చ‌ని సమాచారం. తెలుగుతో పాటు మిగిలిన భాష‌ల ట్రైల‌ర్ల‌ని ఏక కాలంలో విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది.

English summary
SS Rajamouli and producer Shobu Yarlagadda confirmed that the trailer of the second part will be released between 9 a.m. to 10 a.m. on March 16 in theatres across Andhra Pradesh and Telangana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu