»   » లీక్: కారకులు ఎవరంటూ రాజమౌళి ఎంక్వయిరీ, హడావుడిగా ప్రెస్ మీట్!

లీక్: కారకులు ఎవరంటూ రాజమౌళి ఎంక్వయిరీ, హడావుడిగా ప్రెస్ మీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి ది కంక్లూజన్' మూవీ ట్రైలర్ మార్చి 16 (గురువారం) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ముందుగానే ప్రకటించింది. అయితే ఉన్నట్టుండి గురువారం ఉదయం 9 గంటల‌లోపే ట్రైలర్ రిలీజైంది. దీంతో ట్రైలర్ లీక్ అయిందంటూ ప్రచారం మొదలైంది. లీకైన విషయాన్ని రాజమౌళి కూడా ఒప్పుకున్నారు.

ఈ పరిణామాలతో షాకైన బాహుబలి మూవీ టీం హడావుడిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి..... ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇలా ఎందుకు జరిగింది? సాయంత్రం రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్ ఉదయమే ఎలా లీక్ అయింది? అంటే.... రాజమౌళి వద్దగానీ, మూవీ టెక్నికల్ టీం వద్దగానీ సరైన సమాధానం లేదు.

ఇదే విషయం రాజమౌళిని అడిగితే ఆయన ఎవరూ ఊహించని విషయం చెప్పారు.

ఫేస్ బుక్ కారణంగా

ఫేస్ బుక్ కారణంగా

ఫేస్‌బుక్‌లో వచ్చిన బగ్‌ కారణంగా అనుకున్న దాని కంటే ముందే ఈ ట్రైలర్‌ విడుదలై పోయింది. అసలు ఇలా ఎందుకు జరిగిందో విచారణ చేస్తున్నామని రాజమౌళి తెలిపారు.

ఇది లీకేజీ కాకపోవచ్చు

ఇది లీకేజీ కాకపోవచ్చు

ఇది లీకేజీ అని అనుకోవడం లేదు. టెక్నికల్ సమస్య వల్లే ఇలా జరిగిందని అనుకుంటున్నాం. దీనికి ఎవరూ బాధ్యులు కాకపోవచ్చు అని రాజమౌళి తెలిపారు. ఏదేమైనా ట్రైలర్‌ చూసిన అభిమానులు సంతోషంగా ఉన్నారు అది చాలా అంటూ ఈ ఇష్యూను కవర్ చేసే ప్రయత్నం చేసారు రాజమౌళి.

పైరసీ వేరు, లీకేజీ వేరు

పైరసీ వేరు, లీకేజీ వేరు

లీక్ కావడం, పైరసీ చేయడం రెండూ వేర్వేరు. లీక్ అనేది కొన్ని సార్లు అనుకోకుండా టెక్నికల్ సమస్యల ద్వారా జరిగిపోవచ్చు. కావాలని ఎవరూ లీక్ చేయరు అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

వారిని థియేటర్లకు రప్పించడానికే

వారిని థియేటర్లకు రప్పించడానికే

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది సింగిల్‌ లైన్‌ సమాధానం కాదు. ఇందుకు చంపేశాడని సింపుల్‌గా చెప్పడానికి లేదు. సినిమా ప్రారంభమైన తర్వాత అందరూ సినిమాలో మునిగిపోతారు. ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. వారిని థియేటర్లకు రప్పించడానికే ఆ ప్రశ్న. అందుకే అలా చూపించి తొలి భాగాన్ని వదిలేశామని రాజమౌళి తెలిపారు.

English summary
Baahubali: The Conclusion trailer was leaked online, just hours before its official launch on Thursday. The trailer was originally planned to be launched online on Thursday evening. Following the leak, the trailer of the film's Tamil, Hindi and Telugu versions were also officially released online.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu