twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైనాలో ప్రభాస్‌పై షాకిస్తున్న అభిమానం.. బాహుబలి 2 స్టిల్స్ అలా, అవెంజర్స్‌తో ఫొటోలు వైరల్!

    |

    ప్రపంచ వ్యాప్తంగా మహా చిత్రం అవెంజర్స్ హవా కొనసాగుతోంది. ఊహకి కూడా అందని విధంగా ఈ చిత్ర వసూళ్లు కొనసాగుతున్నాయి. ప్రాంతీయ భాష చిత్రాలు జోరు కొనసాగే ఇండియాలో కూడా అవెంజర్స్ చిత్రం మంచి వసూళ్ళని సాధిస్తోంది. ఇదే సమయంలో భారతయ సినిమా చరిత్రలో అతిపెద్ద విజయం సాధించిన బాహుబలి 2 చిత్రం చైనాలో విడుదలయింది. అవెంజర్స్ నుంచి త్రీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ మంచి వసూళ్లనే రాబడుతోంది. బాహుబలి 2, అవెంజర్స్ చిత్రాలపై చైనా జనం ప్రత్యకమైన అభిమానాన్ని చాటుకుంటున్నారు. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    Recommended Video

    Bahubali Had Huge Collections in china To
    రికార్డులు లేవు

    రికార్డులు లేవు

    బాహుబలి చిత్రం చైనాలో ఈ నెల 4 న విడుదలైంది. దంగల్, భజరంగి భాయీజాన్ వంటి చిత్రాల లాగా ఈ చిత్రం రికార్డులు సాధించలేకపోయింది. దీనికి అవెంజర్స్ వంటి భారీ చిత్రం పోటీగా ఉండడం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. రికార్డులు సాధించలేకపోయిన చైనా అభిమానుల మనసు మాత్రం బాహుబలి చిత్రం గెలుచుకుంది.

    వసూళ్లు ఇలా

    వసూళ్లు ఇలా

    బాహుబలి 2 చిత్రం మే 10 వ తేదీ వరకు చైనాలో 68 కోట్ల సాధించినట్లు తెలుస్తోంది. చైనాలో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాలో ఈ చిత్రం నిలుస్తుందని భావించారు. కానీ మొదటి 5 స్థానాల్లో బాహుబలి 2 చిత్రం ఉండే అవకాశం లేదు. దంగల్ చిత్రం 1300 కోట్లు, సీక్రెట్ సూపర్ స్టార్ 700 కోట్లు, భజరంగి భాయీజాన్ 300 కోట్లు, హిందీ మీడియం 200 కోట్లు, పీకే 100 కోట్లతో తొలి ఐదుస్థానాల్లో ఉన్నాయి.

    అక్కడ అమిర్ ఖాన్‌ హవా

    అక్కడ అమిర్ ఖాన్‌ హవా

    చైనాలో మోస్ట్ పాపులర్ ఇండియన్ హీరోగా అమిర్ ఖాన్ తిరుగులేని ఇమేజ్ సంపాదించారు. దంగల్ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ హాలీవుడ్ విదేశీ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

    తీవ్రమైన పోటీ

    తీవ్రమైన పోటీ


    అవెంజర్స్ చిత్రం నుంచి బాహుబలి 2 తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. అవెంజర్స్ కేవలం ఒక్క రోజులోనే చైనాలో 50 కోట్లు సాధించడం విశేషం. కానీ ఫాంటసీ చిత్రంగా వచ్చిన బాహుబలి 2 కి కూడా కొన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఫోటోలు పోస్ట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

    అవెంజర్స్‌తో బాహుబలి

    అవెంజర్స్‌తో బాహుబలి

    అవెంజర్స్ హీరోలంతా నిలబడి ఉండగా వారి ముందు ప్రభాస్ రాజసంగా సిమ్హాసనంలో కూర్చుని ఉన్న స్టిల్ తో చైనా అభిమానులు బాహుబలి 2 పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. వివిధ రకాలుగా బాహుబలి, అవెంజర్స్ స్టిల్స్ కలిపి సోషల్ మీడియాలో చైనా అభిమానులు వైరల్ చేస్తన్నారు.

    English summary
    Baahubali 2 wins hearts in China. Fan tributes go viral on social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X