»   » షాకింగ్: ‘బాహుబలి’ తొలి మూడు రోజుల్లో 160 కోట్లు!

షాకింగ్: ‘బాహుబలి’ తొలి మూడు రోజుల్లో 160 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లు కురిపిస్తోంది. ఓ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు కలిపి రూ. 160 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4వేల థియేటర్లలో ‘బాహుబలి' సినిమా విడుదల చేసారు. తొలి వీకెండ్ (శుక్ర, శని, ఆది) బాహుబలి సినిమా దాదాపు 160 కోట్లు ఓవరాల్‌గా వసూలు చేసినట్లు తెలుస్తోంది. మూవీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆధర్శ్ ఇందుకు సంబంధించిన వివరాలు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


Baahubali 3 days collections Rs 160 crore

సినిమా ఒక్క అమెరికాలోనే ఈ చిత్రం (గురు, శుక్ర, శని) రూ. 23 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు అమెరికాలో ఈ రేంజిలో వసూళ్లు రాలేదు. తెలుగు వెర్షన్ రూ. 21.91 కోట్లు, తమిళ వెర్షన్ 98.82 లక్షలు వసూలయ్యాయి. బాహుబలి ఇందీ డబ్బింగ్ చిత్రం విడుదల రోజైన శుక్రవారం రూ. 5.15 కోట్లు వసూలు చేసింది. శనివారం ఏకంగా 7.09 కోట్లు, ఆదివారం 10.11 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్ మొత్తం కలిపి రూ. 7.5 కోట్లు మించవని అనుకున్నారు. కానీ మూడు రోజుల్లోనే రూ. 22.35 కోట్లు వసూలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈచిత్రం రికార్డు స్థాయిలో 3.48 కోట్లు వసూలు చేసింది. నైజా ఏరియాలో తొలి మూడు రోజుల్లో 13.42 కోట్ల షేర్ సాధించింది.


English summary
If initial trends are anything to go by SS Rajamouli's Baahubali has already crossed Rs 160 crore at the box office.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu