‘బాహుబలి’ మూడో షెడ్యూల్ మొదలైంది
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా మూడో షెడ్యూల్‌లోకి ఎంటరైంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
మొదటి షెడ్యూల్ షూటింగ్ కర్నూలు సమీపంలోని గుట్టల ప్రాంతంలో జరిగింది. సెకండ్ షెడ్యూల్ రాజమోజీ ఫిల్మ్ సీటీలో వేసిన భారీ సెట్టింగులో పూర్తి చేసారు. తాజాగా మూడో షెడ్యూల్ షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో జరుగుతోంది.
బాహుబలి షూటింగుకు సంబంధించిన వీడియో డాటాను స్టోర్ చేసేందుకు 'కస్టమ్ బుల్ట్ ఆన్ లొకేషన్ డాటా స్టోరేజీ' అనే పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. హాలీవుడ్ రేంజి సినిమాల్లో ఉపయోగించే ఈ డాటా స్టోరేజీ యంత్రాన్ని బాహుబలి చిత్రం కోసం వాడుతుండటం గమనార్హం.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ సెట్టింగులు వేసారు. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు.
ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.
దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












