బాహుబలి : డిసెంబర్ 14న హీరో రానా వంతు!
హైదరాబాద్: 'బాహుబలి' చిత్ర దర్శకుడు రాజమౌళి సినిమా పబ్లిసిటీ విషయంలో ప్లానింగ్‌గా ముందుకు సాగుతున్నారు. తొలుత ప్రభాస్ బర్త్ డే సందర్భంగా బాహుబలి తొలి మేకింగ్ వీడియోను విడుదల చేసి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని మరొక మేకింగ్ వీడియో విడుదల చేసారు.
బాహుబలి మూడో టీజర్ డిసెంబర్ 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు విడుదల చేయడానికి కారణం రానా పుట్టినరోజు కావడమే. అదే రోజు ఈచిత్రానికి సంబంధించిన రానా ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈచిత్రంలో రాణాకు జోడీగా హీరోయిన్ ప్రణీతను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం తర్వాతి షెడ్యూల్ షూటింగ్ కేరళలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.


Click it and Unblock the Notifications












