బాహుబలి 4 వారాల కలెక్షన్స్: ఏరియా వైజ్ షేర్
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ బాక్సాఫీసు వద్ద విజయవంతంగా బాక్సాఫీసు వద్ద 4 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు కలెక్షన్ల ప్రభంజనంతో దూసుకెళ్లిన ఈ చిత్రం 5వ వారంలో మహేష్ బాబు ‘శ్రీమంతుడు' కాంపిటీషన్ తో స్లో అయింది.
సినిమా విడుదలై నేటితో నెల రోజులు పూర్తయింది. అయినప్పటికీ సినిమా డీసెంట్ నెంబర్ ఆఫ్ థియేటర్లలో రన్ అవుతోంది. యూఎస్ఏతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెలుతోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.
4 వారాలు పూర్తయ్యే నాటికి ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్లకు లాభాలతో కూడిన షేర్ సాధించి పెట్టింది. బాలీవుడ్లో ఈచిత్రం రూ. 43 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 102.43 కోట్ల షేర్ వసూలు చేసింది. అన్ని భాషల్లో కలిపి వరల్డ్ వైడ్ రూ. 23.48 కోట్ల షేర్ వసూలు చేసినట్లు సమాచారం.
సమీప భవిష్యత్తులో ఏ తెలుగు స్టార్ టచ్ చేయలేని విధంగా బాహుబలి సినిమా కలెక్షన్ల రికార్డు సృష్టించింది. బాహుబలి రికార్డుల బద్దలు కొట్టడం కేవలం బాహుబలి పార్ట్ 2తోనే సాధ్యం. స్లైడ్ షోలో బాహుబలి 4 వీక్స్ వరల్డ్ వైడ్ షేర్ డీటేల్స్ ఏరియా వైజ్...

ఏపీ, తెలంగాణ
నైజాం: 38.25 కోట్లు
సీడెడ్: 20.60 కోట్లు
గుంటూరు: 9.10 కోట్లు
వైజాగ్: రూ. 9.20 కోట్లు
ఈస్ట్ గోదావరి: 8.36 కోట్లు
వెస్ట్ గోదావరి: 6.55 కోట్లు
4 వారాల టోటల్: 102.43 కోట్లు

ఓవర్సీస్
బాహుబలి మూవీ ఓవర్సీస్ లో రూ. 27.75 కోట్ల షేర్ సాధించింది.

కర్ణాటక
బాహుబలి సినిమా కర్ణాటకలో రూ. 32.10 కోట్ల షేర్ సాధించింది.

తమిళం
తమిళంలో బాహుబలి మూవీ 21.50 కోట్ల షేర్ సాధించింది.

మళయాలం
మలయాళంలో బాహుబలి సినిమా రూ. 3.90 కోట్ల షేర్ సాధించింది.

హిందీ
హిందీలో బాహుబి సినిమా 43 కోట్ల షేర్ సాధించింది.


Click it and Unblock the Notifications











