»   » ఇండియన్ బాక్సాఫీస్ టాప్ -10: బాహుబలి పొజిషన్?

ఇండియన్ బాక్సాఫీస్ టాప్ -10: బాహుబలి పొజిషన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెలుతోంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్(విడుదలై తొలివారాంతం శుక్ర, శని, ఆది) కలెక్షన్ల విషయంలో ఇండియ్ టాప్ 4 పొజిషన్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల విషయంలో ధూమ్ 3 మొదటి స్థానంలో, పికె 2వ స్థానంలో, హ్యాపీ న్యూ ఇయర్ 3వ స్థానంలో ఉంది.

ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) గ్రాస్ కలెక్షన్స్...


1. ధూమ్ 3................... రూ. 198 కోట్లు
2. పికె .........................రూ. 175 కోట్లు
3. హ్యాపీ న్యూఇయర్...... రూ. 174 కోట్లు
4. బాహుబలి............... రూ. 162 కోట్లు
5. చెన్నై ఎక్స్ ప్రెస్......... రూ. 160 కోట్లు
6. సల్మాన్ ఖాన్-కిక్ ..... రూ. 126 కోట్లు
7. బ్యాంగ్ బ్యాంగ్........... రూ. 123 కోట్లు
8. సింగం రిటర్న్స్......... రూ. 119 కోట్లు
9. యే జవానీ హై దివానీ రూ. 105 కోట్లు
10. దబాంగ్ 2.............రూ. 102 కోట్లు


Baahubali 4th Highest Grossing Indian Film

ఇక బాలీవుడ్ ‘బాహుబలి' సినిమా అంచనాలకు మించి వసూలు చేస్తోంది. సోమవారం కూడా వసూళ్లు భారీగానే వచ్చాయి. తొలి 4 రోజులు (శుక్ర 5.15 కోట్లు, శని 7.09 కోట్లు, ఆది 10.11 కోట్లు, సోమ రూ. 6.10 కోట్లు) ఈ చిత్రం 28.45 కోట్లు వసూలు చేసింది.


‘బాహుబలి' సినిమా రిలీజైతే టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలవుతాయని అంతా ముందే ఊహించారు. ఎట్టకేలకు ఈ సినిమా సోమవారం(4వ రోజు).... 82 సంవత్సరాల టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.


ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం రూ. 83 కోట్లతో టాపులో ఉండేది. బాహుబలి చిత్రం కేవలం 4 రోజుల్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు కలిపి ‘బాహుబలి' 200 కోట్ల క్లబ్బులో చేరింది. తెలుగు వెర్షన్ 83 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమా బిజినెస్ మొత్తం పూర్తయ్యే వరకు వసూళ్లు భారీగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.


2009కి ముందు మహేష్ బాబు నటించిన ‘పోకిరి' సినిమా ఇండస్ట్రీ రికార్డుగా ఉండేది. 2009లో వచ్చిన ‘మగధీర' చిత్రం 9 రోజుల్లో ఆ రికార్డును బద్దలు కొట్టింది. తర్వాత ‘అత్తారింటికి దారేది' చిత్రం మగధీర రికార్డు బద్దలు కొట్టడానికి దాదాపు 25 రోజుల సమయం తీసుకుంది. తాజాగా బాహుబలి కేవలం 4 రోజుల్లోనే ‘అత్తారింటికి దారేది' రికార్డును బద్దలు కొట్టడం గమనార్హం.

English summary
SS Rajamouli's visual spectacle Baahubali continues to shatter the Box Office records. The epic war film turned out to be the fourth highest grossing Indian film in world.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu