ప్రభాస్ క్రేజీ రికార్డు.. సౌత్‌లో మరే హీరోలకు సాధ్యంకాని విధంగా!

Recommended Video

Baahubali Actor Prabhas Breaks Records In Social Media | Filmibeat Telugu

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు జాతీయవ్యాప్తంగా నెలకొన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రభాస్ నటించే సినిమాల కోసం తెలుగు అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో జాతీయ వ్యాప్తంగా ఉన్నా అభిమానులు కూడా అదే స్థాయిలో ఎదురుచూస్తున్నారు. ఆరడుగుల కటౌట్ తో ఆకర్షించే రూపం ప్రభాస్ సొంతం. అందుకే ప్రభాస్ ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకడిగా ఉన్నాడు. ప్రభాస్ తాజాగా సోషల్ మీడియాలో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

ప్రభాస్ కోసం 10 మిలియన్లమంది

ప్రభాస్ కోసం 10 మిలియన్లమంది

అభిమానులతో టచ్ లో ఉండేందుకు సెలెబ్రిటీలు ఎక్కువగా ఎంచుకునే మార్గం సోషల్ మీడియా. స్టార్ హీరోలకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ అభిమానులు ఉంటారు. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ పేస్ బుక్ లో ప్రభాస్ సౌత్ ఇండియన్ హీరోలందరికంటే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రభాస్ పేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య తాజాగా 10 మిలియన్లు(ఒక కోటి) దాటిపోవడం విశేషం.

తిరుగులేని స్టార్ డమ్

తిరుగులేని స్టార్ డమ్

బాహుబలి 2 చిత్రం భారతీయ చలన చిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో ప్రభాస్ నటన అందరిని అబ్బురపరిచింది. ప్రభాస్ ఒక్కసారిగా ఇండియాలో తిరుగులేని హీరోగా మారిపోయాడు. ప్రభాస్ చిత్రాలకు ఇప్పుడు ఇండియా మొత్తం భారీ మార్కెట్ ఉంది. ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం 200 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం సాహోలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఒడిశాకు సాహూ టీమ్

ఒడిశాకు సాహూ టీమ్

ఇదిలా ఉండగా ప్రభాస్ తో సహా సాహో చిత్ర యూనిట్ త్వరలో ఓడిశాలోని కటక్ లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. పురుషుల హాకీ ప్రపంచకప్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరు కానున్నారట. ఈ వేడుకలో రెహమాన్ సంగీత ప్రదర్శన ఉంటుందని సమాచారం. నవంబర్ 28 న జరిగే ఈ ఈవెంట్ కోసం ప్రభాస్, శ్రద్దా కపూర్, నీల్ నితిన్ ముఖేష్ హాజరవుతారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రెండు చిత్రాలతో

రెండు చిత్రాలతో

ప్రభాస్ ప్రస్తుతం సాహోతో పాటు రాధాకృష్ణ దర్శత్వంలో మరో ప్రేమ కథలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 1960 కాలం నాటికి సంబంధించింది. ప్రభాస్ నటిస్తున్న ఈ రెండు చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాహుబలి 2 తరువాత ప్రభాస్ నుంచి మరో చిత్రం విడుదల కాలేదు. సాహో 2019 లో విడుదల కానుండడంతో ప్రభాస్ క్యాలెండర్ లో 2018 ఖాళీగా మిగిలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X