బాహుబలి : రానా కొడుకు ఇతనే (ఫోటో)
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి'. ప్రభాస్, రానా, అనుష్క ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. తమన్నా కూడా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ 'పంజా' చిత్రంలో నటించిన అడవి శేష్ ఈచిత్రంలోనూ ఓ పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో అడవి శేష్... రానా కుమారుడి పాత్రలో కనిపించబోతున్నాడట. రానాతో పాటు అడవి శేష్ కూడా ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. బాహుబలి చిత్రంలో అడవి శేష్‌కు సంబంధించిన లుక్ ఇక్కడ చూడొచ్చు. సినిమా చారిత్రక నేపథ్యంలో సాగుతున్న నేపథ్యంలో పాత్రధారులంతా భారీ గడ్డాలతో కనిపిస్తున్నారు. ఈ చిత్రం కోసం అడవి శేష్ కూడా భారీగా గడ్డం పెంచేసాడు. వీకెండ్ లవ్ ఆడియో వేడుక సందర్బంగా అడవి శేష్ రావడంతో ఫోటోగ్రాఫర్లకు చిక్కాడు.

దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది.
ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











