»   »  ‘బాహుబలి’ పాటల సీడీలు కావాలా, అయితే ఆర్డర్ చేయండి!

‘బాహుబలి’ పాటల సీడీలు కావాలా, అయితే ఆర్డర్ చేయండి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్ర ధారులుగా ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి' చిత్రం ఆడియో ఈ నెల 31న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మూవీ పాటల సీడీలు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్‌లో కూడా లభ్యం కానున్నాయి. ఒక్కో సీడీ ధర రూ. 99గా నిర్ణయించారు. కావాలనుకుంటే ఇప్పుడు ప్రీ-ఆర్డర్ చేయొచ్చు. ఆడియో విడుదల తర్వాత మీకు సీడీలు పంపిస్తారు.

అమేజాన్‌లో ఈ సీడీలు పెట్టిన ఒక రోజులోనే...అమేజాన్ బెస్టర్ సెల్లర్స్ లిస్టులో ఈ సీడీలు చేరాయి. అంటే బాహుబలి ఆడియో కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎంఎం కీరవాణి ఈచిత్రానికి సంగీతం అందించారు. ఆడియో సూపర్బ్ గా ఉండబోతోందని టాక్.


ఆడియో వేడుక హైదరాబాద్ లోని హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆడియోను లహరి మ్యూజిక్ వారు విడుదల చేయబోతున్నారు. ఆడియో రైట్స్ ఈ సంస్థ ఏకంగా రూ. 3 కోట్లు చెల్లించి సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. జులై నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే సినిమాలోని ముఖ్యపాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల చేసి భారీ హైప్ తెచ్చారు రాజమౌళి.


Baahubali audio CD tops the best sellers list in Amazon

ఆడియో వేడుక కార్యక్రమానికి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇదే వేదికపై రెండు నిమిషాల ఐదు సెకన్ల నిడివితో సాగే థియేట్రికల్‌ ట్రైలర్‌ని కూడా విడుదల చేస్తారు. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ''మా 'బాహుబలి' ఆడియో విడుదల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి అంగీకరించిన మా 'ఈగ'కు ధన్యవాదాలు'' అని రాసుకొచ్చారు రాజమౌళి.


ఆడియో లాంచ్ లో రిలీజ్ చేయనున్న ఫైనల్ ట్రైలర్ కట్ రెడీ అయ్యింది. ట్రైలర్ కి సంబందించిన సెన్సార్ కూడా పూర్తయ్యిందని, సెన్సార్ వారు ‘యు/ఏ' ఇచ్చారని ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపాడు. ఈ ట్రైలర్ రన్ టైం 2 నిమిషాలు 5 సెకన్లు ఉండబోతోంది.


తెలుగు న్యూస్ ఛానల్ టీవీ5 భారీ ధర చెల్లించి ప్రత్యక్ష ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఈ రేటు ఒక కోటి అని తెలుస్తోంది. కోటి రూపాయలు ఓ ఆడియో పంక్షన్ టెలీకాస్ట్ రైట్స్ కు పలకటం సాధారణ విషయం కాదు అంటున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా జులై 10న 3500 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం.


ఇందులో భాగంగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు పరిచయం చేయడానికి కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వేదికగా చేసుకొంది. శోభు యార్లగడ్డ, ఛాయాగ్రాహకుడు కె.కె.సెంథిల్‌కుమార్‌, ఎస్‌.ఎస్‌.కార్తికేయ ఆధ్వర్యంలో ఓ బృందం కేన్స్‌కు వెళ్లింది. అక్కడ కేన్స్‌ ప్రతినిధి క్రిస్టియన్‌ జేన్‌ను కలిశారు.

English summary
With in one day, Baahubali Audio CD tops the best sellers list in Amazon. Grab your CD's at http://amzn.to/1LEBeff.
Please Wait while comments are loading...