‘బాహుబలి’ ఆడియో లాంచ్...హైదరాబాద్‌లో కాదా?
హైదరాబాద్: ‘బాహుబలి' ఆడియో లాంచ్ కార్యక్రమం మే 31వ తేదీన హైదరాబాద్ లో జరుగాల్సి ఉండగా పోలీసు శాఖ అనుమతి ఇవ్వక పోవడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే రాజమౌళి, ప్రభాస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అభిమానులకు క్షమాపణ చెప్పారు.
తర్వాత ‘బాహుబలి' ఆడియో వేడుక జూన్ 10న రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడైతే అభిమానులు ఎంతమంది వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదనే వాదన వినిపించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి ఆడియో వేడుక జూన్ 13కు వాయిదా పడిందని, హైదరాబాద్ లో కాకుండా తిరుపతిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘బాహుబలి'కి సంబంధించిన మరో ట్రైలర్ కూడా ఇదే ఆడియో వేడుకలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘బాహుబలి' ఆడియో వేడుకలో ఎలాంటి సమస్య ఏర్పడకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించనున్నారు.
ఇక ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. సినిమా హాలీవుడ్ ప్రమాణాలకు దగ్గరగా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇదో గొప్ప చిత్రం. 250 కోట్ల ఖర్చుతో...రెండు భాగాలుగా తెరకెక్కుతోది. తొలి భాగం జులై 10న ‘బాహుబలి - ది బిగినింగ్' పేరుతో తెరకెక్కుతుంది. రెండో భాగం 2016లో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











