»   »  ‘బాహుబలి’: మరో వందకోట్లు రాబట్టే వ్యూహం!

‘బాహుబలి’: మరో వందకోట్లు రాబట్టే వ్యూహం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' మూవీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎవరి ఊహకు అందని విధంగా ఈ చిత్రం ఇప్పటికే దాదాపు రూ. 450 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం కేవలం దేశీయ బాషలైన తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో మాత్రమే విడుదలైంది.

 Baahubali to be dubbed in Chinese

తాజాగా ఈచిత్రాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ వివిధ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా చైనీస్ బాషతో పాటు ఇంగ్లీష్ బాషలోకి అనువదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కోట్లో ఈ చిత్రం మరో 100 కోట్లు ఈజీగా వసూలు చేస్తుందని భావిస్తున్నారు.


ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులతో ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ సినిమాల ఎడిటర్ విన్సెంట్ టబైలాన్ ను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఎడిటింగ్ తరువాత ఇంటర్నేషనల్ వర్షన్ విడుదలకు సిద్ధం కానుంది. 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్', 'టేకెన్ 2', 'నౌ యూ సీ మీ', 'ద లెజెండ్ ఆఫ్ హెర్క్యులస్' వంటి పలు చిత్రాలకు విన్సెంట్ ఎడిటర్ గా పనిచేశారు.

English summary
Baahubali to be dubbed in Chinese. incent Tabaillon, known for his editing works in films like "The Incredible Hulk", "Clash of the Titans", etc., will edit the international version of the film, which is expected to be ready by October.
Please Wait while comments are loading...