»   » ‘బాహుబలి’ బెనిఫిట్: మెగా హీరో, డైరెక్టర్ల సందడి (ఫోటోస్)

‘బాహుబలి’ బెనిఫిట్: మెగా హీరో, డైరెక్టర్ల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత రెండేళ్లుగా అభిమానులు ‘బాహుబలి' సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేయడం, రానా విలన్ రోల్ పోషిస్తుండటం, అనుష్క, తమన్నా లాంటి స్టార్స్ నటించడంతో సినిమాపై ముందు నుండి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గొప్ప సినిమాగా దీన్ని తీర్చి దిద్దడం, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగి పోయాయి.

గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత బెనిఫిట్ షోలోలు మొదలయ్యాయి. అందరి కంటే ముందే బాహుబలి సినిమా చూడటానికి ఇటు అభిమానులతో పాటు అటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజయ్యారు. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ ప్రత్యేక షోలను ఏర్పాటు చేసారు.


మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో పాటు దర్శకుడు దేవా కట్ట, మారుతి, నటుడు హవీష్ తదితరులు ఈ బెనిఫిట్ షోలకు హాజరయ్యారు. బెనిఫిట్ షో ప్రారంభానికి ముందు థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ నృత్యాలు చేస్తూ సందడి చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....


సాయి ధరమ్ తేజ్
  

సాయి ధరమ్ తేజ్

బాహుబలి బెనిఫిట్ షోకు హాజరైన మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్.


మారుతి
  

మారుతి

బాహుబలి బెనిఫిట్ షోకు హాజరైన దర్శకుడు మారుతి.


దేవా కట్ట
  

దేవా కట్ట

బాహుబలి బెనిఫిట్ షోకు హాజరైన దర్శకుడు దేవా కట్ట.


హవీష్
  

హవీష్

బాహుబలి బెనిఫిట్ షోకు హాజరైన నటుడు హవీష్.


జోగి
  

జోగి

బాహుబలి మూవీ బెనిఫిట్ షోకు హాజరైన యాక్టర్ జోగి.


దిల్ రాజు
  

దిల్ రాజు

బాహుబలి బెనిఫిట్ షో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నైజా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు.


ఫ్యాన్స్ హంగామా
  

ఫ్యాన్స్ హంగామా

శ్రీరాములు థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.


 


Please Wait while comments are loading...