»   » బాహుబలి కాసుల వర్షంపై కొత్త ట్రైలర్ (వీడియో)

బాహుబలి కాసుల వర్షంపై కొత్త ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తెలుగు సినిమా చిత్రంలోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో బాహుబలి సినిమా బిగ్గర్ దన్ బిగ్గెస్ట్ అంటూ కొత్త ట్రైలర్ విడుదల చేసారు. సీనిమాలో రాజమౌళి కనిపించే సీన్లతో ఈ ట్రైలర్ విడుదలైంది. మీరూ ఓ లుక్కేయండి.


ఎవరి ఊహకు అందని విధంగా ఈ చిత్రం ఇప్పటికే దాదాపు రూ. 450 కోట్లకుపైగా వసూలు చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం కేవలం దేశీయ బాషలైన తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో మాత్రమే విడుదలైంది.


తాజాగా ఈచిత్రాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ వివిధ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా చైనీస్ బాషతో పాటు ఇంగ్లీష్ బాషలోకి అనువదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కోట్లో ఈ చిత్రం మరో 100 కోట్లు ఈజీగా వసూలు చేస్తుందని భావిస్తున్నారు.


Baahubali bigger than the Biggest: Rajamouli

ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులతో ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ సినిమాల ఎడిటర్ విన్సెంట్ టబైలాన్ ను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఎడిటింగ్ తరువాత ఇంటర్నేషనల్ వర్షన్ విడుదలకు సిద్ధం కానుంది. 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్', 'టేకెన్ 2', 'నౌ యూ సీ మీ', 'ద లెజెండ్ ఆఫ్ హెర్క్యులస్' వంటి పలు చిత్రాలకు విన్సెంట్ ఎడిటర్ గా పనిచేశారు.


'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

English summary
“Baahubali” is a 2-part film, the first of which was shot simultaneously in two regional languages, Tamil and Telugu, and was dubbed into Hindi and Malayalam as well.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu