175 కోట్లు: బాహుబలి గురించిన షాకింగ్ న్యూస్!
హైదరాబాద్: ఇప్పటి లెక్కల ప్రకారం మన తెలుగు సినిమా ఎంత పెద్ద హిట్టయినా రూ. 100 కోట్లును మించిన వసూళ్లు సాధించడం కష్టమే అని ఇటీవల విడుదలైన 'అత్తారింటికి దారేది' చిత్రంతో రుజువైంది. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఇప్పటి వరకు భారీ వసూళ్లు సాధించిన సినిమా ఇదే. ఈచిత్రం వసూళ్లు రూ. 100 కోట్లు క్రాస్ అవుతాయని అంతా భావించారు. అయితే రూ. 90 కోట్లు మార్కు కూడా అందుకోలేకపోయింది.
కానీ రాజమౌళి మాత్రం తెలుగు సినిమా చరిత్ర అంచనాలను మాత్రమే కాదు...ఏకంగా ఇండియన్ సినిమా అంచనాలనే అధిగమించే బడ్జెట్‌తో 'బాహుబలి' సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బాహుబలి సినిమాకు రూ. 100 కోట్లు అటు ఇటుగా ఖర్చు పెడుతున్నారని అనుకున్నారంతా. కానీ బడ్జెట్ అంతకంటే ఎక్కువే అని అంటున్నారు.

బాహుబలి సినిమాను రెండు పార్టులుగా చిత్రీకరిస్తున్న రాజమౌళి.....రెండు భాగాలకు కలిపి రూ. 175 కోట్ల వరకు ఖర్చు పెట్టిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఇండియన్ సినిమా చిరిత్రలో ఇదే అత్యంత భారీ బడ్జెట్ మూవీ.
ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో పాటు విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట. రెండు పార్ట్స్ కాబట్టి పెట్టిన పెట్టబడి గ్యారంటీగా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకైతే రాజమౌళి అంచనాలు తప్పలేదు. ఏది చేసినా ముందు దాని గురించి క్షుణ్ణంగా స్టడీచేసి పర్‌ఫెక్టుగా చేయడం ఆయన స్టైల్. మరి రాజమౌళి ప్రయత్నం సక్సెస్ అయి తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని ఆశిద్దాం.
ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి మొదటి పార్ట్ 2015లో థియేటర్లోకి వస్తుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











