»   »  250 కోట్లు: బాహుబలి బడ్జెట్ వివరాలు వెల్లడించిన రాజమౌళి

250 కోట్లు: బాహుబలి బడ్జెట్ వివరాలు వెల్లడించిన రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘బాహుబలి' సినిమాకు సంబంధించిన బడ్జెట్ మీద ఎవరికీ సరైన క్లారిటీ లేదు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం బడ్జెట్ 200 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. తాజాగా తమిళ వెర్షన్ బాహుబలి ట్రైలర్ రిలీజ్ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజమౌళి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సూర్య చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ... బాహుబలి ఫస్ట్ పార్ట్ ఖర్చు రూ. 150 కోట్లు అయిందని.... సెకండ్ పార్టు పూర్తయే వరకు సినిమా మొత్తం బడ్జెట్ రూ. 250 కోట్లు అవుతుందని తెలిపారు. 2016లో బాహుబలి సెకండ్ పార్ట్ విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి వెల్లడించారు.

Baahubali Budget Is 250 Crores: Rajamouli

ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే అతిపెద్ద సినిమా అని చెప్పొచ్చు. ఇంత ఖర్చు ఇప్పటి వరకు ఏ సినిమాకు పెట్టలేదు. ఇంత భారీ బడ్జెట్ చూసి భారతీయ సినీప్రియులు నోరెళ్ల బెడుతున్నారు. అయితే ఇంత బడ్జెట్ పెట్టిన నిర్మాతలు అంతకు రెట్టింపు రాబట్టుకునేందుకు పక్కా ప్లానింగుతో ముందుకు సాగుతున్నారు.

బాహుబలి సినిమాకు సంబంధించి ఓ హాలీవుడ్ స్టూడియోతో రూ. 500 కోట్ల డీల్ కుదిరినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రముఖ హాలీవుడ్ సినీ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోతో రూ. 500 డీల్ కుదిరినట్లు సమాచారం. మార్కెటింగ్ కూడా భారీ ఎత్తున చేస్తున్నారు.

English summary
Talking about the Baahubali Budget, Jakkanna said that first part has been made at a budget of 150 crores and the total budget including the second part will touch upto 250 crores until the second part's release in 2016.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu