»   » పాత్రను ప్రేరణగా... ‌: 'బాహుబలి' కేక్‌! (వీడియో)

పాత్రను ప్రేరణగా... ‌: 'బాహుబలి' కేక్‌! (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని బాహుబలి పాత్రను ప్రేరణగా తీసుకుని లిటిల్‌ ట్రీట్స్‌ అనే సంస్థ ప్రత్యేకంగా కేక్‌ను తయారు చేసింది.

bahu

ఈ విషయాన్ని 'బాహుబలి' చిత్ర బృందం తమ అధికారిక ఫేస్‌బుక్‌ ద్వారా తెలుపుతూ... దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.


Baahubali Cake !

This one is for @subhashini ramsingh , @pradeep bhandari and my lovely friends and family .


Posted by Little Treats on 27 September 2015

విడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం 50 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునీమీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని గతంలోనే ప్రకటించారు.


తెలుగులో ‘బాహుబలి' మూవీ బిజినెస్ పూర్తవడంతో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక తెలుగు వెర్షన్ చిత్రమే రూ. 172 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో సినిమా చరిత్రలో ఈ రేంజిని అందుకునే సత్తా త్వరలో రాబోయే ‘బాహుబలి-2' సినిమాకు తప్ప మరే సినిమాకు లేదని చెప్పడంలో సందహం లేదు.


bahu cake

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి'. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ చిత్రం ఇప్పుడు బుల్లి తెరలను అలరించబోతోంది.

English summary
Rajamouli's Baahubali cake desined by Little Treats.
Please Wait while comments are loading...